కలుషితమైన ఏపీ రాజకీయాలను హుందాగా మార్చేందుకు కూటమి సర్కార్ శ్రీకారం చుట్టింది. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఇదివరకు, ప్రస్తుత ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పాలనాపరంగా చంద్రబాబు తనదైన మార్క్ వేయడంతోపాటు పార్టీ తీసుకునే నిర్ణయాల్లోనూ మార్క్ చూపిస్తున్నారు. ఇప్పుడు టీడీపీ తీసుకున్న ఓ నిర్ణయంతో వైసీపీ సెల్యూట్ చేయకమానదు.
మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని చంద్రబాబు ఎప్పుడో ప్రకటించారు. వైసీపీ నేతలు గతంలో వ్యక్తిత్వహనానానికి పాల్పడినా తాము ఆ తరహా రాజకీయాలు చేయబోమన్న చంద్రబాబు దాన్ని చేతల్లో చేసి చూపిస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది టీడీపీ.
జగన్ హయాంలో ప్రతిపక్ష లీడర్లను విమర్శించేందుకు వైసీపీ లీడర్లు, కార్యకర్తలు హద్దులు దాటారు. విషయంలోకి కుటుంబ సభ్యులను తీసుకొచ్చి..నీచంగా మాట్లాడారు. అది చూసి టీడీపీ కార్యకర్తల నెత్తురు ఉడికింది. అధికారంలోకి వచ్చాక చూపిద్దామని ఐదేళ్లు ఓపిక పట్టారు. తమ నేతల కుటుంబ సభ్యులపై అసహ్యంగా మాట్లాడితే తామెందుకు ఊరుకోవాలని ఎదురుదాడి మొదలుపెట్టారు.
అయితే, ఇలాంటి ప్రతీకార, కక్షపూరిత రాజకీయాలను ఎంకరేజ్ చేయబోమని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ భార్యపై టీడీపీ లీడర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ..కిరణ్ పై పార్టీ వేటు వేసింది. ఎవరైనా హుందాగా మాట్లాడాలని, లేదంటే వేటు తప్పదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కలుషితమైన రాజకీయాలను చక్కబెడుతున్న చంద్రబాబుకు ఇప్పుడు వైసీపీ కూడా హ్యాట్సాప్ చెప్పి తీరాల్సిందే.