జగన్ పరువును సొంత పార్టీ నేతలే తీసేస్తున్నారు. ప్రశంసలతో జగన్ కు భారీ ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా.. అవన్నీ కామెడీ అవుతున్నాయి. ఇందుకు కారణం.. వైసీపీ నేతలు పరిధి దాటి చేస్తున్న వ్యాఖ్యలే.
జగన్ రాప్తాడు పర్యటనపై మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశంలో అత్యధిక ప్రజాదరణ నేత జగన్ అని ఎలివేషన్ ఇచ్చారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యధిక ప్రజాదరణ కల్గిన నేత , ఇంటెలిజెన్స్ సంస్థల రిపోర్ట్ ల ప్రకారం థ్రెట్ ఉన్న నేత జగన్ అని చెప్పారు.
ప్రస్తుతం జగన్ రాజకీయంగా పేలవమైన స్థానంలో ఉన్నారు. ఆయన దగ్గర మార్కులు కొట్టేసేందుకు శ్రీకాంత్ రెడ్డి , గోరంట్ల మాధవ్ లు ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. మొన్నటి ఎన్నికల్లో పులివెందులలోనే అతి కష్టంపై. అతి తక్కువ మెజార్టీపై గెలుపొందారు జగన్. అయినా ఆయన ఏపీ కాదు.. దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత అంటూ ప్రకటించడం కామెడీగా మారిందని సొంత పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటున్నారు.
ఇద్దరు నేతలు వరుసగా చేసిన ఈ వ్యాఖ్యలు ట్రోల్ అవుతున్నాయి. జగన్ పై ప్రశంసల కోసం వైసీపీ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలు.. వారికి ఎలా అనిపిస్తున్నాయో కానీ, జగన్ కు మాత్రం కామెడీగా అనిపిస్తాయని వైసీపీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ.