ఒలింపిక్స్ అంటే విశ్వక్రీడా సంబరం అయితే అందులో క్రికెట్ ఎందుకు లేదో అనేది చాలా మందికి వచ్చే డౌట్. ఓ సారి కామన్వెల్త్ గేమ్స్ లో పెట్టారు కానీ అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఇప్పుడు ఒలింపిక్స్ లోనూ చేర్చారు. 2028 లాస్ ఏంజెల్స్ ఒలిపింక్స్ లో మేల్, ఫీమేల్ విభాగంలో క్రికెట్ కూ చోటిచ్చారు. కాకపోతే వన్డే మ్యాచ్ లు కాకుండా టీ 20లు నిర్వహిస్తారు. ఆతిధ్య జట్టుగా అమెరికాకు చాన్స్ వస్తుంది. మిగిలిన ఐదు జట్ల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.
క్రికెట్ ఆట కొన్ని దేశాలకే పరిమితమయింది. ఈ కారణంగా ఇప్పటి వరకూ ఒలింపిక్స్లో చేర్చలేదు. కానీ 1900 సంవత్సరంలో జరిగిన పారిస్ ఒలంపిక్స్ లో మాత్రం గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య క్రికెట్ పోటీ నిర్వహించారు. ఆ తర్వాత అంతర్జాతీయంగా పెద్ద ప్రాచుర్యం లేదన్న కారణంతో ఐఓసీ క్రికెట్ ను పక్కన పెట్టింది. మిగిలిన ఆటలన్నీ గంటన్నరలో అయిపోతాయి. కానీ క్రికెట్ మాత్రం రోజంతా సాగుతుంది. ఇది కూడా ఓ సమస్య. టెస్ట్ మ్యాచ్ అయితే ఐదు రోజులు సాగుతుంది. ఇప్పుడు టీ ట్వంటీ ఫ్రార్మాట్ రావడం చాలా దేశాల్లో క్రికెట్ కూ ఆదరణ పెరగడంతో మళ్లీ లెక్కలోకి తీసుకుంది.
ఐసీసీలో ఇప్పుడు వంద దేశాలకు సభ్యత్వం ఉంది కానీ టెస్టు హోదా ఉన్న దేశాలు మాత్రం పన్నెండే. వీటిలోనూ నాలుగు టీములు చాలు బలహీనం. మొత్తంగా ఏడెనిమిది జట్లు మాత్రమే ప్రపంచ స్థాయి క్రికెట్ ఆడుతున్నాయి. మిగతా వాటిల్లో ప్రమాణాలు పెరగాల్సి ఉంది. ఆదరణ పెరిగితే ఆటోమేటిక్ గా ఆయా దేశాల్లో క్రికెట్ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది క్రికెట్ ప్రపంచానికి మంచి పరిణామం అవుతుంది.