HCU ల్యాండ్ ను వేలం వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ కూడా సహకరించారని కేటీఆర్ ఆరోపణలు రాజకీయాలను వేడెక్కించాయి. తన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ ఎంపీ ఎవరనేది బయటపెడుతానని స్పష్టం చేసిన కేటీఆర్..ఇంకా ఎంపీ పేరు బయటపెట్టలేదు. కేటీఆర్ కు దమ్ముంటే ఆ ఎంపీ ఎవరనేది బయటపెట్టాలని కాంగ్రెస్ , బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రేవంత్ , బీజేపీ ఎంపీతో కలిసి ల్యాండ్ డీలింగ్ ఉన్నది నిజమైతే కేటీఆర్ ఎందుకు బయటపెట్టడం లేదు? మూడు రోజులుగా ఎందుకు ఊరిస్తున్నారు? అసలే వివాదాస్పద 400 ఎకరాలను తనఖా పెట్టి 10వేల కోట్ల భూకుంభకోణం చేశారని కేటీఆర్ చేసిన ఆరోపణలు తేలిపోయాయి. బాండ్లను చూపించి ప్రభుత్వం నగదు పొందటం ఏవిధంగా స్కామో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఈ క్రమంలోనే ఆయన వ్యాఖ్యలు ట్రోలింగ్ కు గురయ్యాయి. దీన్ని డిఫెండ్ చేసేందుకు హరీష్ రావు రంగంలోకి డిగాల్సి వచ్చింది. 400 ఎకరాలను ICICI బ్యాంక్ తనఖా పెట్టుకోలేదని చెబుతుందంటే..మరి ప్రభుత్వం ఎవరి దగ్గర తనఖా పెట్టి పదివేల కోట్లు తీసుకునుందని ప్రశ్నించారు. కేటీఆర్ మాత్రం బీజేపీ ఎంపీ ఈ ఎపిసోడ్ లోకి తీసుకురావడంతో విషయం పక్కదోవ పట్టినట్లు అయింది
నెక్స్ట్ ఆ ఎంపీ పేరు బయటపెడుతానని మూడు రోజులుగా కేటీఆర్ సైలెన్స్ గా ఉండటం ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు ఆ ఎంపీ పాత్ర ఉందా? ఉంటే పేరు చెప్పాలని డిమాండ్ చేస్తుండటంతో ఒత్తిడి పెరుగుతోంది. మరి కేటీఆర్ ఆపేరును ఎప్పుడు ప్రకటిస్తారో..లేదంటే పాలిటిక్స్ లో ఆయన విశ్వసనీయత తగ్గే అవకాశం ఉంటుంది.