దళితులకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని , ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని లోక్ సభ స్పీకర్ గా చేసిన ఘనత టీడీపీదని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూర్ జిల్లా తాటికొండ మండలం పొన్నెకల్లులో పర్యటించిన చంద్రబాబు.. అంబేద్కర్ జయంతి సందర్భంగా జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కులవివక్షవ్యతిరేకంగా అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేశారు చంద్రబాబు. రాజ్యాంగంలో దళితులకు ప్రత్యేక హక్కులను పొందుపరిచారని ప్రస్తావించారు. సమానత్వం కోసం అంబేద్కర్ నిర్వారమంగా కృషి చేశారని, ఆయన స్ఫూర్తితో దళితుల ఉద్దరణకు టీడీపీ పాటుపడుతుందని, దళితుల హక్కులను కాపాడేందుకు ఎప్పుడూ ముందు ఉంటామని స్పష్టం చేశారు.
అంబేద్కర్ విదేశీ విద్యా దీవెనను మళ్లీ ప్రారంభిస్తామని పునర్దాఘటించారు. సబ్ ప్లాన్ ద్వారా దళితుల అభివృద్ధికి కృషి చేస్తామని , రెసిడెన్షియల్ స్కూల్ లో మెరుగైన విద్య, భోజనం అందిస్తున్నామన్నారు. 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. వారిలో అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు ఎనిమిది లక్షల ఎకరాలను గతంలో మంజూరు చేసిందని గుర్తు చేశారు.