కల్యాణ్ రామ్ కొత్త సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’ విడుదలకు సిద్ధమైంది. టీజర్, ట్రైలర్.. ఈ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ప్రదీప్ దర్శకుడు. ఆయనకు ఇది తొలి సినిమా అనుకొంటున్నారంతా. కానీ ఇది వరకే ‘రాజా చేయి వేస్తే’ అనే ఓ సినిమా తీశారు. తారకరత్న, నారా రోహిత్ కలసి నటించిన సినిమా అది. అప్పట్లో మంచి బజ్ తో విడుదలైంది. కానీ ఫ్లాప్. ఇన్నాళ్లకు ఓ కథ రెడీ చేసుకొని, కల్యాణ్ రామ్ కు చెప్పి ఒప్పించి, సినిమా పూర్తి చేయగలిగాడు. విజయశాంతి కీలక పాత్ర పోషించడం ఈ సినిమాకు మరో ప్లస్.
అయితే.. దర్శకత్వ విభాగంలో కల్యాణ్ రామ్ జోక్యం చాలా ఉందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ… కల్యాణ్ రామ్ దగ్గరుండి చూసుకొన్నాడట. సెట్లో డైరెక్టర్‌గా కల్యాణ్ రామ్ షాడో.. ప్రదీప్‌పై ఉండేదని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాతగా కల్యాణ్ రామ్ కు అనుభవం ఉంది. అందుకే మార్కెట్ విషయంలో అన్నీ తానై వ్యవహరించాడని తెలుస్తోంది. ఏరియాల వారిగా సినిమా ఎవరి చేతుల్లో పెట్టాలి, డిస్టిబ్యూషన్ ఎవరికి ఇవ్వాలి? అనేది కూడా కల్యాణ్ రామ్ దగ్గరుండి చూసుకొన్నాడని సమాచారం. `బింబిసార` తరవాత కల్యాణ్ రామ్ కు హిట్ పడలేదు. మధ్యలో చేసిన సినిమాలు నిరాశ పరిచాయి. అందుకే ఈసారి పక్కా కమర్షియల్ సినిమా ఎంచుకొన్నాడు. సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఇన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సివచ్చింది. ఈనెల 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.