సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ కు ఆగ్రహం వచ్చింది. పోలీసులు తనను టార్గెట్ చేస్తున్నారని ఆమె సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో తాను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఏఐ ఫోటో అంశంలో పోలీసులు తనకు నోటీసు జారీ చేశారు. ఈ నోటీసు విషయంలో గచ్చిబౌలి పోలీసులకు పూర్తి స్టేట్ మెంట్ ఇచ్చానని సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ తెలిపారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తన బాధ్యత నిర్వహించానన్నారు.
అయితే తాను షేర్ చేసిన ఫోటోను మరో రెండు వేల మంది వ్యక్తులు షేర్ చేశారని వారందరిపై ఇలాంటి చర్యలు తీసుకున్నారా అని ఆమె స్టేట్ మెంట్ ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ప్రశ్నించారు. ఒక వేళ తీసుకోకపోతే సెలక్టివ్ గా టార్గెట్ చేసినట్లుగా అవుతుందని చట్టం న్యాయం అందరికీ సమానమేనని ఆమె స్పష్టం చేశారు. స్మితా సభర్వాల్ ట్వీట్ వైరల్ గా మారింది. ఇతరులు ఇలాంటి ఫోటోలు షేర్ చేయడానికి ప్రభుత్వంలో భాగంగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణిగా షేర్ చేయడానికి ఉన్న తేడాను ఆమె గుర్తించలేకపోతున్నారా లేక.. ప్రభుత్వాన్ని ధిక్కరించాలని డిసైడయ్యారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఫేక్ ఫోటోలతో కంచ గచ్చిబౌలి భూముల్లో వన్యప్రాణులు ఉన్నట్లుగా సృష్టించారు. ఆ ప్రచారంలో ప్రభుత్వంలో ఓ శాఖకు విభాగాధిపతిగా ఉన్న ఐఏఎస్ షేర్ చేయడం అంటే.. ఖచ్చితంగా సర్వీస్ రూల్స్ ను ఉల్లంఘించడమే అవుతుంది. చాలా మంది ఈ ఫేక్ ఫోటోలను క్రియేట్ చేసిన వారిపై కేసులు పెడుతున్నారు. స్మిత్ సబర్వాల్కు నోటీసులు మాత్రమే జారీ చేశారు. అయినా తనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని ఆమె సమర్థించుకునే ప్రయత్నం చేయడం కాక పోలీసులు టార్గెట్ చేస్తున్నారని విక్టిమ్ కార్డు ప్రయోగిస్తున్నారు. స్మితా ట్వీట్ పై ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.