తన కాళ్లకు ఎవరూ నమస్కారం చేయొద్దని, తల్లిదండ్రులు, గురువుల కాళ్లకు మాత్రమే నమస్కారం చేయాలని నేతలు పదేపదే చెబుతుంటారు.కానీ, వాటినే ఎక్కువగా కోరుకుంటారు. తమకు సాష్టాంగ నమస్కారం చేయాలని తపిస్తారు. కానీ, అతికొద్ది మాత్రమే వీటిని తిరస్కరిస్తారు..అలాంటి అరుదైన నేతల్లో చంద్రబాబు టాప్ లో ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు జగన్ ఇలాంటి వాటిని కోరుకునే ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న వ్యక్తి అని మరోసారి ప్రూవ్ అయింది. రఘురామకృష్ణంరాజు – జగన్ కు మధ్య ఎక్కడ చెడిందో మంత్రి వాసంశెట్టి పలు కీలక విషయాలను బయటపెట్టారు.
చంద్రబాబు ప్రజలతో సాదాసీదాగా కలిసిపోతారు. ప్రజల్లో ఒక్కడిగా ఉండేందుకు ఇష్టపడతారు. నేతలతోనైతే కొన్నిసార్లు జోవియల్ గా ఉంటారు. జగన్ కు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం. ఓ గీతగీసుకొని చక్రవర్తిలా ఫీల్ అవుతుంటారు. కాళ్లు మొక్కించుకోవాలని ఎక్కువగా ఇష్టపడుతారని అంటారు. చంద్రబాబు అయితే ఇలాంటి వాటిని తరుచుగా వ్యతిరేకిస్తారు. “ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు తన కాళ్లు మొక్కవద్దని, వారించినా కూడా వినకుండా ఎవరైనా తన కాళ్లకు మొక్కితే…తిరిగి తాను కూడా వాళ్ల కాళ్లకు మొక్కుతా” అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గతేడాది అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు వచ్చిన చంద్రబాబు కాళ్లకు ఓ వ్యక్తి నమస్కరించడంతో వెంటనే స్పందించిన చంద్రబాబు ‘నన్ను కూడా మీ కాళ్లకు నమస్కారం చేయమంటారా?’ అని ఆ వ్యక్తి కాళ్లు పట్టుకునేందుకు వంగారు. ఇది సాధారణ వ్యక్తితో చంద్రబాబు వ్యవహరించిన విధానం.
కానీ, జగన్ మాత్రం ఏకంగా నేతలతోనే కాళ్లు మొక్కించుకునేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేవారు అనేది మరోసారి స్పష్టం అయింది. ఎమ్మెల్సీ పదవి కోసం జగన్కు సాష్టాంగ నమస్కారం చేయమన్నారని, ఇలాంటి వాటిని జగన్ ఎక్కువగా ఇష్టపడతారని దనుంజయ రెడ్డి చెప్పినట్లు ,వాసంశెట్టి చెప్పుకొచ్చారు. సార్ అని సంబోధించలేదని, ఎదుట కాళ్లు మీద కాలేసుకొని కూర్చున్నారనే రఘురామపై జగన్ కక్ష పెంచుకున్నారని కీలక విషయాలను బయటపెట్టారు. దీన్ని బట్టి చూస్తే జగన్ లో ఫ్యాక్షనిస్ట్ పోలికలు పదిలంగా ఉన్నాయని అంటున్నారు.