బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో హరీష్ రావు రాజకీయం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సభ సక్సెస్ చేసేందుకు ఫామ్ హౌజ్ వేదికగా నేతలతో నిత్యం కేసీఆర్ మంత్రాంగం నడుపుతున్నారు. కేటీఆర్ , కవిత ఇద్దరూ సన్నాహక సమావేశాల్లో పాల్గొంటూ రజతోత్సవ సభ విజయవంతం చేసేలా క్యాడర్ లో ఉత్తేజం నింపుతున్నారు. హరీష్ మాత్రం అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తుండటం చర్చనీయాంశం అవుతోంది.
ఉద్యమ సమయంలోనైనా, కేసీఆర్ అధికారం చేపట్టాక అయినా బీఆర్ఎస్ బాస్ ఏదైనా సభ నిర్వహించాలని తలిస్తే, హరీష్ రావుతో తప్పకుండా చర్చించేవారనేది ఓపెన్ సీక్రెట్. సభ విజయవంతం కోసం ఏమేం చేయాలనే దానిపై హరీష్ తో మంతనాలు కొనసాగించేవారు. పార్టీలో ఎలాంటి కుదుపు ఏర్పడినా హరీష్ ను రంగంలోకి దింపేవారు కేసీఆర్. వాటిని ఆయన మాత్రమే సాఫ్ట్ గా డీల్ చేస్తారని బాధ్యతలు అప్పగించేవారు అందుకే, హరీష్ రావును బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ గా పిలుస్తారు. అధికారం కోల్పోయాక పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటున్న హరీష్ రావు… కీలకమైన బీఆర్ఎస్ రజోత్సవ సభపై సైలెంట్ గా ఉంటుండటానికి కారణం ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదు.
కేసీఆర్ ఆదేశాలతోనే హరీస్ రావు సైలెంట్ అయ్యారా? లేదంటే కేటీఆర్ , కవిత రాజకీయంతో విసిగి మౌనం వహిస్తున్నారా అని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా సర్కార్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్ల దాడి చేసే హరీష్ కొన్ని రోజులుగా పెద్దగా ట్వీట్లూ చేయడం లేదు. పార్టీలో జోష్ తీసుకురావాల్సిన ఈ కీలక సమయంలో ఎందుకు హరీష్ ఏమిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు అనేది పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది.