రాజ్ కసిరెడ్డిని, సీతారామాంజనేయుల్ని అరెస్టు చేసే సరికి వైసీపీలో షివరింగ్ వచ్చేసింది. వెంటనే బెదిరించాలని రంగంలోకి దిగిపోయారు. అయితే యధావిథిగా ఈ బెదిరింపులకు అంబటి రాంబాబును రంగంలోకి దింపారు. ఆయన చంద్రబాబు నీ వయసు 75 ఏళ్లు అని వయసు గుర్తు చేసి బెదిరించారు. సంగతి చూస్తామన్నట్లుగా హెచ్చరించారు. ఆయన అయన హెచ్చరికలు అంత సీరియస్ గా అనిపించకపోవడంతో వైసీపీ మీడియా, సోషల్ మీడియా కూడా వైరల్ చేయలేకపోయింది. వైసీపీ నేతల్ని జైల్లో పెడితే అక్కడే చచ్చిపోము కాద.. నెలకో.. వంద రోజులకో వస్తామని కదా అని ఆయన లాజిక్.
అంబటి రాంబాబుకి ఇలాంటి బెదిరింపులు ఎందుకు చేయాల్సి వస్తుందో అందరి కంటే ఎక్కువే తెలుసు. ఈ బెదిరింపుల్ని తాను మాత్రేమే ఎందుకు చేయాలని.. వీటి కోసం సజ్జలనో.. మరొకరినో ఎందుకు తెరపైకి తీసుకు రారో కూడా ఆయనకు తెలుసు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల్ని హింసించడం, ప్రజల్ని దోపిడీ చేయడమే పనిగా పెట్టుకుంటే.. ఇలాంటి పరిస్థితులే వస్తాయి. ఇప్పటికే ఇంకా అరెస్టులు, ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి. టీడీపీ నేతల్ని ఎంత భయపెట్టినా.. భయపడటానికి ఏమీ ఉండదు. ఎందుకంటే.. అసెంబ్లీలో తొలి రోజున చంద్రబాబు జగన్ హయాంలో కేసుల పాలైన వాళ్లు చేతులు ఎత్తమంటే.. 99 శాతం మంది చేతులు ఎత్తారు.
అంటే జగన్ హయాంలో ఎన్ని వేధింపులు ఎదుర్కోవాలో అన్నీ ఎదుర్కొన్నారు. కేసుల పరంగా.. శారీరక హింసల పరంగా ఎదుర్కొన్నారు. ఇక మిగిలింది భౌతికంగా నిర్మూలించడమే. చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగిన ప్రతీ సారి అదే స్కెచ్ అమలు చేశారు. ఇంకా కొత్తగా చంద్రబాబు ఎదుర్కొనే సవాళ్లు ఏమీ ఉండకపోవచ్చు. క్రమినల్ ఆలోచనలతో అడ్డగోలు దోపిడీ చేసిన వారు.. క్రిమినల్స్ తరహాలో వ్యవహరించిన వారికి ఇంకా చాలా కాలం మ్యూజిక్ ఉంటుందని టీడీపీ వర్గాలంటున్నాయి.