ఏపీలో పది నెలలుగా ఎదురు చూస్తున్న సినిమా స్టార్ట్ అయింది. ఐదు సంవత్సరాల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా చేసిన నేరాలు, ఘోరాల చిట్టాను బయటకు తీసి ఒక్కొక్కరికి ఒక్కో ఎపిసోడ్ చూపించేందుకు సిద్ధమయ్యారు. పక్కా ఆధారాలను సేకరించేందుకు ఇంత కాలం సమయం తీసుకున్నా.. ఇక నుంచి అంతా యాక్షన్ ఎపిసోడ్లే ఉండేలా దర్యాప్తు సంస్థలు ఏర్పాట్లు చేసుకున్నాయి. అందుకే ముందు ముందు సస్పెన్స్ కు కొదవ ఉండకపోవచ్చు.
ఇక ఏడుపులు – పెడబొబ్బలే !
లిక్కర్ స్కామ్ ట్రాక్ మీదకు వచ్చిందని తెలియగానే జగన్ రెడ్డి ఏడవడానికి పీఏసీ మీటింగ్ పెట్టారు. రాజ్ కసిరెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్టు చేయడంపై బాధపడ్డారు. వ్యవస్థలన్నీ దిగజారిపోయానని ఏడ్చినంత పని చేశారు. తర్వాత మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారని కూడా చెప్పారు. కానీ ఆయన తన దాకా రారని అనుకుంటున్నారేమో కానీ.. వారంతా అరెస్టు అవుతోంది జగన్ రెడ్డి వల్లనే . ఆ ఒక్కడి కక్కుర్తి, మానసిక వికృతం వల్లనే అందరూ అరెస్టు అవుతున్నారు. అందుకే సానుభూతి చూపిస్తున్నట్లుగా ఏడుపులు, పెడబొబ్బలు పెడుతున్నారు.
ఒక్క సారి జైలుకెళ్లొస్తే పోతుందిగా అనే మనస్థత్వం
రెడీ అయ్యా ఒక్క సారి జైలుకెళ్లి వస్తే పోతుందిగా అనుకున్నా అని పీఎస్ఆర్ ఆంజయనేయులు పోలీసు అధికారులతో చెప్పారంటే.. ఆ ముఠాకు వ్యవస్థల మీద ఎంత గౌరవం ఉందో.. అర్థం చేసుకోవచ్చు. పోలీసుగా చేసిన ఆయన నేరాలకు పాల్పడితే ఒక సారి జైలుకెళ్లి వస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. తనకు పరువు, మర్యాద.. అనేవి ఉండవని అనుకుంటున్నారు. ఇంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డి తన మాఫియాను మార్చారు.
ఈడీ కదలికలు కూడా సిగ్నల్స్ పంపిస్తున్నాయిగా !
జగన్ అక్రమాస్తుల కేసు తేలాల్సి ఉంది. ఈడీ కొత్తగా జప్తులు ప్రారంభించింది. ఇప్పటి వరకూ లేని కదలికలు కొత్తగా కనిపిస్తున్నాయి. జగన్ కేసులు న్యాయవ్యవస్థ పనితీరును ప్రశ్నించేలా మారాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో దర్యాప్తు సంస్థలు చరుకుచూపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే వివేకా హత్యకేసులోనూ సూత్రధారులు బయటకు రావాల్సి ఉంది. ఇప్పుడు సినిమా స్టార్ట్ అయింది. అసలు సస్పెన్స్ ధ్రిల్లర్ సీన్స్ ముందు ముందు చాలా కనిపించబోతున్నాయి.