హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు ఊపు వస్తుందని భావిస్తున్న ఏ ఒక్క నిర్ణయం కూడా అనుకున్నంత సక్సెస్ ఫుల్‌గా అమలు కావడం లేదు. లే ఔట్ రెగ్యులరజైషన్.. సరైన ప్రాసెస్ లేక ఫెయిల్ అయింది. గడువు పెంచినా ఎవరూ పట్టించుకోవడంలేదు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే ఎల్ ఆర్ఎస్ ప్రక్రియను కూడా సరిగ్గా చేయకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం నిరాశలో ఉంది.
అయితే ప్రభుత్వం బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ తీసుకు వస్తే మాత్రం మంచి ఆదరణ ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఇంటి ప్లాన్లను తీసుకోవడం ఎందుకు అని చాలా మంది ఒక్క అంతస్తు పర్మిషన్ మీద .. రెండు, మూడు అంతస్తులు నిర్మించుకుంటూ ఉంటారు. లంచాలు, ఆఫీసులు చుట్టూ తిరగడం వంటి బాధల వల్ల ప్లాన్లు తీసుకోరు. ఆన్ లైన్ ద్వారా ప్లాన్లు ఇచ్చే ప్రాసెస్ వచ్చింది కానీ అది దరఖాస్తు వరకే.
ఇప్పుడు LRS తీసుకు వస్తే .. సింపుల్ ప్రాసెస్ పెడితే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అలాగే ఆస్తి పన్నులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. నిబంధనలకు అనుగుణంగా ఉండి.. కొన్ని అంతస్తులు ఎక్కువగా నిర్మించిన వారికి ఈ స్కీమ్ ఎక్కువ ఉపయోగపడుతుంది. ప్రభుత్వానికీ ఆదాయం వస్తుంది.