లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ఎవరన్నది క్లారిటీ వచ్చేసింది. జగనే ఈ లిక్కర్ స్కామ్ బిగ్ బాస్ అంటూ ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తోన్న రాజ్ కసిరెడ్డి కీలక సమాచారాన్ని బయటపెట్టారు. ఈ కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తానన్న విజయసాయిరెడ్డి ఈ లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ఎవరో తనకు తెలియదని చెప్పగా.. రాజ్ కసిరెడ్డి మాత్రం జగన్ పేరును కక్కేశారు. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
కొన్ని రోజులుగా విచారణకు హాజరు కాకుండా అజ్ఞాతంలో ఉన్న రాజ్ కసిరెడ్డిని ఇటీవల సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక సమాచారాన్ని బయటపెట్టినట్లు సమాచారం. జగన్ ఆదేశాలతోనే తాను ఈ లిక్కర్ పాలసీలో నడుచుకున్నానని వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి , నేతలకు ప్రయోజనం చేకూర్చేలా లిక్కర్ పాలసీని ఖరారు చేయాలనే టాస్క్ ను తనకు జగన్ అప్పగించారని చెప్పుకొచ్చారు. దీంతో కొత్త పాలసీ రూపొందించినట్లు చెప్పారు.
మిధున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వాసుదేవ రెడ్డి కలిసి మద్యం నుంచి ముడుపులు రాబట్టేలా పాలసీ ఖరారు చేశామని చెప్పుకొచ్చారు. జగన్ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి తో పాటు పలువురికి ఇందులో పాత్ర ఉందని రాజ్ కసిరెడ్డి అంగీకరించినట్లు సిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా రిమాండ్ రిపోర్టులో ఏ1 గా రాజ్ కసిరెడ్డి, ఏ 4గా ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, ఏ 5 గా విజయసాయిరెడ్డిని పేర్కొన్నారు.
అయితే , ఈ లిక్కర్ స్కామ్ అంత జగన్ కనుసన్నలోనే జరిగిందని రాజ్ కసిరెడ్డి చెప్పినా..రిమాండ్ రిపోర్ట్ లో జగన్ పేరును చేర్చకపోవడం గమనార్హం.