తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి’ పలు భాషల్లో రీమేక్ అయ్యింది. తమిళంలో `ఆదిత్య వర్మ` పేరుతో రీమేక్ చేశారు. గిరీశయ్య దర్శకుడు. ఆ తరవాత తెలుగులో ‘రంగ రంగ వైభవంగా’ సినిమాకు దర్శకత్వం వహించారు. మెగా హీరోవ వైష్ణవ్ తేజ్ నటించిన ఈ సినిమా డిజాస్టర్. అయితే ఇప్పుడు గిరీశయ్య కల్యాణ్ రామ్ కోసం ఓ కథ సిద్ధం చేసినట్టు సమాచారం. చాలా రోజులుగా కల్యాణ్ రామ్ చుట్టూ తిరుగుతున్నారు గిరీశయ్యా. కల్యాణ్ రామ్ కు కూడా కథ నచ్చింది. అయితే… గిరీశ్ ని వెయిటింగ్ లో ఉంచారు. ఇప్పుడు ఈ కథని ఓకే చేసినట్టు తెలుస్తోంది.
ఇదో యాక్షన్ డ్రామా అని సమాచారం. రొటీన్ ఫార్ములాకు కాస్త భిన్నంగా సాగే కథ అని తెలుస్తోంది. బడ్జెట్ కూడా ఎక్కువే కాబోతోంది. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’ తరవాత కల్యాణ్ రామ్ చేయబోయే సినిమా ఇదే కావొచ్చు. ‘బింబిసార 2’ కూడా పట్టాలెక్కించే ఐడియా వుంది. అయితే ‘బింబిసార’ కథ పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. పైగా ‘బింబిసార 2’కు రూ.100 కోట్లకు మించి బడ్జెట్ అవసరం. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’ హిట్ అయితే, ‘బింబిసార 2’ చేయడానికి కావల్సినంత ఉత్సాహం దొరికేది. కానీ ఫలితం తారు మారు అవ్వడంతో `బింబిసార` కాస్త వెనక్కి వెళ్లే అవకాశం ఉంది.