దానం నాగేందర్ ఇక ఆగడం లేదు. భారత రాష్ట్ర సమితి గేటు దగ్గరే ఉన్నారు. ఒక్క పిలుపు పిలిస్తే చాలు వచ్చేస్తానని సంకేతాలు ఇస్తున్నారు. కేసీఆర్ ను ఆహో.. ఓహో అంటున్నారు. ఇప్పుడు కశ్చన్.. దానం నాగేందర్ ను బీఆర్ఎస్ పిలుస్తుందా లేదా అనే.
బీఆర్ఎస్ సభ సూపర్ సక్సెస్ అవుతుందని దానం నాగేందర్ తాజాగా ప్రకటించారు. కేసీఆర్ ను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వస్తారని ఆయన జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ గురించి ఇంత పాజిటివ్ గా దానం మాట్లాడటం సాధారణ విషయం కాదు. అసెంబ్లీలో బూతులు తిట్టిన ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. తర్వాత కేటీఆర్ ను కలిసి సారీ చెప్పానని కూడా చెప్పుకున్నారు. స్మితా సబర్వాల్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని కూడా తప్పు పట్టారు. ఆమె ప్రభుత్వాన్ని ఉద్దేశించి సోషల్ మీడియా పోస్టు చేయలేదన్నారు.
దానం నాగేందర్ కాంగ్రెస్ ను బ్లాక్ మెయిల్ చేద్దామని అంటున్నారా.. ఇక కాంగ్రెస్ తో పని కాదని తన దారి తాను చూసుకోవాలనుకుంటున్నారా అన్నది సస్పెన్స్ గా మారింది. దానంను పార్టీలో చేర్చుకుని సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించారు కానీ.. అందు కోసం ఆయనకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చడం లేదు. హైదరాబాద్ పరిధిలో ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా తనకు మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు కానీ.. అసలు పరిశీలనలోకి కూడా తీసుకోలేదు. ఇతర హామీలను కూడా పట్టించుకోవడం లేదు.
ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్లడానికి సిద్ధమే .. కానీ ఆయనను ఆహ్వానిస్తారా అన్నదే సందేహం. ఎందుకంటే అనర్హతా వేటు తప్పించుకోవడానికి దానం కొత్త ప్లాన్ వేస్తున్నారని బీఆర్ఎస్ అనుమానించే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేయడం ద్వారా ఫిరాయింపు చేశానని ఆయనే ఓ రికార్డెడ్ సాక్ష్యం వ్యవస్థలకు అందించారు.