ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది సుదీర్ఘంగా సాగే షెడ్యూల్. ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. ఆ పాటలో.. శ్రుతిహాసన్ కనిపించబోతోందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ప్రశాంత్ నీల్ `సలార్`లో శ్రుతి ఓ కీలకమైన పాత్ర పోషించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ‘సలార్ 2’లోనూ శ్రుతి కనిపించబోతోంది. ఇప్పుడు ఆ సెంటిమెంట్ ని ప్రశాంత్ నీల్ రిపీట్ చేయబోతున్నాడని టాక్.
సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ కి తప్ప, పాటలకు పెద్దగా స్కోప్ ఉండదు. అయితే.. ఈసారి ఎన్టీఆర్ కోసం పాటలకు సినిమాలో చోటిచ్చినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఇది వరకు లేనన్ని పాటలు.. ఈ సినిమాలో వినిపిస్తాయని సమాచారం అందుతోంది. అందులో ఈ ఐటెమ్ పాట ఒకటి. రుక్మిణీ వసంత్ ఈ చిత్రంలో కథానాయికగా నటించబోతోంది. అయితే.. రుక్మిణిది రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాదని, ఆమె పాత్ర టిపికల్ గా ఉంటుందని, అందుకే గ్లామర్ కోసం శ్రుతిహాసన్ని టీమ్ లో చేర్చారని తెలుస్తోంది. టాకీ మొత్తం పూర్తయిన తరవాతే.. ఈపాటని తెరకెక్కిస్తారు.