అరెస్ట్ భయంతో వణికిపోతున్న మాజీ మంత్రి విడదల రజనీకి హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్టు చేయకుండా 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఇదే కేసులో ఉన్న ఐపీఎస్ అధికారి జాషువాకూ ఇదే తీర్పు ఇచ్చింది. విడదల రజనీ మరిది గోపి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. ఇప్పటికే ఆయనను అరెస్టు చేసినందున పిటిషన్ డిస్పోజ్ చేసింది.
వైసీపీ ప్రభుత్వం రాగానే.. ఎమ్మెల్యేగా ఉన్న విడుదల రజనీ.. ఆమె కుటుంబీకులు నియోజకవర్గంలో వసూళ్లు ప్రారంభించారు. వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కరిని బెదిరించి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. విడదల రజని మరిది గోపి అన్నింటిలోనూ కీలకంగా వ్యవహరించారు. బాలాజీ స్టోన్ క్రషర్స్ పేరుతో కంకర వ్యాపారం చేసేవారిపై వీరు రుబాబు చేశారు. యాభై కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోయే సరికి పోలీసు అధికారి జాషువా సాయంతో దాడులు చేయించి.. పెద్ద ఎత్తున ఫైన్ వేయించారు.
చివరికి రెండు కోట్లకుబేరం మాట్లాడుకుని దాన్ని వసూలు చేసుకున్నారు. పోలీసు అధికారి కూడా ఇందులో భాగం తీసుకున్నారు. ప్రభుత్వం మారిన తరవాత తమను ఎలా బెదిరించి డబ్బులు వసూలు చేశారో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసులు పెట్టారు. విచారణలో నిజమని తేలడంతో అరెస్టులు ప్రారంభించారు. రెండు రోజుల కిందట విడదల రజని మరిది గోపిని అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్ విషయంలో రజనీకి నిరాశ ఎదురయినట్లయితే ఆమెను కూడా అరెస్టు చేసి ఉండేవారు. అయినా ఆమెపై ఇంకా పలు కేసులు ఉన్నాయి.