ఏపీ లిక్కర్ స్కామ్ లోకల్ కాదు…ఇంటర్నేషనల్ అని పదివేల కోట్ల దోపిడీ జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆరోపించారు. రూ.3200 కోట్ల కుంభకోణం అంటున్నారు…అనఫిషియల్ సేల్ ను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. వేల కోట్ల అక్రమాలు, మనీ లాండరింగ్ జరిగితే ఈడీ, సీబీఐ ఎందుకు రంగంలో దిగడం లేదని టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించారు. రూ.1.30 లక్షల కోట్ల క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే గత ఐదేళ్లు ఈడీ, సీబీఐ ఈ కుంభకోణంపై ఎందుకు దృష్టి సారించలేదని అడుగుతున్నారు.
కరోనా సమయంలో 2020 మార్చి 23న లాక్ డౌన్ విధించారు. మే 4న మద్యం దుకాణాలను రీ ఓపెనింగ్ చేశారు..ఆ 42 రోజులు మాత్రమే మద్యం విక్రయాలు ఆగాయి. కానీ లక్షల క్రేట్ల మద్యం విక్రయాలు తగ్గిపోయినట్లు లెక్క చూపారని సోమిరెడ్డి పత్రాలు బయట పెట్టారు. ఢిల్లీలో రూ.100 కోట్ల ఆరోపణలకు సీఎం, డిప్యూటీ సీఎం, తెలంగాణ, ఏపీ, తమిళనాడుకు చెందిన ప్రముఖులను ఈడీ అరెస్ట్ చేసింది. ఏపీలో రూ.10 వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగాయి. ఇక్కడ రెండు రకాలుగా విచారణ జరగాల్సివుంది..అది సిట్ లెవల్ లోనే తేలిపోతుందా..లేక ఈడీ, సీబీఐ ఎంటరవుతాయో చూడాల్సి ఉందన్నారు.
కమీషన్లతో వేల కోట్లు దోచుకోవడంతో పాటు అనధికారిక సేల్స్ ఒకటైతే, నాసిరకమైన మందు ఇచ్చి ప్రజలు ప్రాణాలను తీసుకోవడం రెండో నేరమన్నారు. 48 బాటిల్స్ ఉన్న క్రేట్కు కు రూ.150 నుంచి రూ.600 చొప్పున కమీషన్ వసూలు చేశారు అనఫిషియల్ సేల్ తో ఒక్కో క్రేట్ కు రూ.10 వేల వరకు ఆర్జించారన్నారు. ఈ కేసులో ఇప్పుడు ఎవరు జైలుకు వెళ్లాలి… వేల కోట్లు ఏ కుటుంబం చేతుల్లోకి వెళ్లాయి.. ఏ కుటుంబం ఎన్ని కుటుంబాల్లోని అమాయకుల ప్రాణాలను బలితీసుకుందో తేల్చాలంటున్నారు. అదే సమయంలో కసిరెడ్డి తనకు తెలియకుండా అదనంగా రూ.2 వేల కోట్లు ఎత్తేశాడని యల్లహంక ప్యాలెస్ లో కూర్చుని జగన్ రెడ్డి బాధపడిపోతున్నాడని సోమిరెడ్డి చెబుతున్నారు.
లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ విచారణలు చేయించాల్సింది టీడీపీనే. కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏం డిమాండ్ కావాలంటే ఆ డిమాండ్ నెరవేర్చుకోగల స్థితిలో ఉన్నారు. మరి ఆ దిశగా ప్రయత్నించకుండా మీడియా ముందు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?