తెలంగాణ రాష్ట్ర సమితికి 24 ఏళ్లు పూర్తయ్యాయి. మధ్యలో పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఇప్పుడు పేరు అదే ఉంది. కానీ వ్యవహారం మాత్రం టీఆర్ఎస్ అన్నట్లుగానే నడిపిస్తున్నారు. ఇక్కడే పూర్తిగా గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే ఈ విషయంలో ప్రజలు అయోమయానికి గురైన ఓడించారు. ఇక ముందు ఆ పార్టీ మళ్లీ రివైవ్ అవ్వాలన్నా.. ఉద్యమ పార్టీలకూ మనుగడ ఉంటుందని నిరూపించాలన్నా ఇలాంటి ఎన్నో అంశాలపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి.
సోల్ మిస్సయిన బీఆర్ఎస్
ఎవరైనా విజయం సాధించాన్నా.. ఏదైనా వ్యాపారం సక్సెస్ కావాలన్నా.. రాజకీయ పార్టీ ప్రజల మనసుల్లో చోటు దక్కించుకోవాలన్నా.. ఓ సోల్ ఉండాలి. దాన్ని ప్రజల్లోకి పంపారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ తో ప్రారంభిచారు. ఆ పార్టీ ఏకైక సోల్ తెలంగాణ. అది సాకారం అయింది. ఆ తర్వాత కూడా తెలంగాణ అంటే టీఆర్ఎస్ అని అనిపించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడైతే పేరును బీఆర్ఎస్ అని మార్చారో అప్పుడే టీఆర్ఎస్ సోల్ పోయిది. రేవంత్ పెట్టినట్లుగా.. తెలంగాణకు..కేసీఆర్ కు ఉన్న పేరు బంధం కూడా తెగిపోయింది. ఎన్నికల ఫలితాలు అవే చెప్పాయి.
ఓటమి తర్వాత మళ్లీ టీఆర్ఎస్ అన్నట్లుగా ప్రచారం
అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత భారత రాష్ట్ర సమితి పరిస్థితి అత్యంత ఘోరంగా మారింది. జాతీయ పార్టీగా మార్చి చేసుకున్న టాం..టాంతో పరువు పోయింది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి ఒక్క సీటు లేకుండా పోయింది. పక్క రాష్ట్రాల్లో హడావుడి చేశారు కానీ పోటీ చేయలేకపోయారు. దీంతో మళ్లీ మనది బీఆర్ఎస్ కాదు.. టీఆర్ఎస్సేనన్నట్లుగా ఆ పార్టీ నేతుల స్ట్రాటజీ మార్చేశారు. తెలంగాణ వాదం ఎత్తుకున్నారు. పేరు భారత రాష్ట్ర సమితి అని ఉండగా.. మాది తెలంగాణ వాదం ..అని పక్క రాష్ట్రాలపై నిందలేస్తున్నారు. దీని వల్ల ప్రజలు మరింత గందరగోళానికి గురవుతున్నారు. ఓట్ల కోసం బీఆర్ఎస్ నేతలు మరీ ఇలా తమను తక్కువ చేస్తారా అని ఓటర్లు ఆలోచించే పరిస్థితి కనిపిస్తోంది
చాలా విషయాల్లో ప్రజలకు స్పష్టత ఇస్తేనే ప్రయోజనం
వరంగల్ శివారులోని ఎల్కతుర్తి బీఆర్ఎస్ బహిరంగసభ జరుగుతుంది. ఇరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుని 25వ ఏట అడుగు పెడుతుంది. ఏడాది మొత్తం సంబురాలు చేసుకుంటామని బీఆర్ఎస్ అంటోంది. పార్టీ నేతలు గులాల్ చల్లుకుని.. కేసులు కోసుకుంటే అది సంబరాలు రాదు. రాజకీయ పార్టీకి గెలుపే అసలైన సంబరం. ఈ ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు రావొచ్చు. వాటిల్లో విజయం సాధించాలంటే… బీఆర్ఎస్ పై ప్రజల్లో ఏర్పడిన అనుమానాలను క్లియర్ చేయాలి. రేవంత్ రెడ్డిని తిట్టడం ద్వారా లేదా కాంగ్రెస్ పై వ్యతిరేకత ద్వారా తాము గెలిచేస్తామని అనుకుంటే…ఇలాంటి బహిరంగసభలతో ఖర్చు తప్ప ప్రయోజనం ఉండదు.