ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కాంలో కర్త,కర్మ,క్రియ జగన్మోహన్ రెడ్డేనని..చిల్లర తప్ప మిగతా మొత్తం కూడా ఆయనకే చేరిందని ఆర్కే చెబుతున్నారు. ఈ మేరకు సీఐడీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆయన తన వారాంతపు ఆర్టికల్.. కొత్తపలుకులో ప్రకటించారు. శాంపిల్ గా లిక్కర్ స్కాం డబ్బులు ఎలా వైట్ అయ్యాయో కూడా వివరించారు. కొంత మంది వందల కిలోల బంగారం కొనడం, మరికొంత మంది బట్టల దుకాణాలకు కోట్లలో చెల్లింపులు చేయడం వంటివి చేశారు. ఆ డబ్బులు జగన్ ఖాతాలోకి మళ్లీ వచ్చి చేరాయంటున్నారు.
లిక్కర్ స్కాం ఎలా జరిగిందో .. ఇప్పటి వరకూ అరెస్టు చేసిన వారంతా పూసగుచ్చినట్లుగా చెప్పారు. ఒక్క రు కూడా ఏమీ దాచుకోలేదని చెబుతున్నారు. ముఖ్యంగా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అనే అధికారులు పూర్తిగా అన్నీ చెప్పేశారు. తమకు లభించింది.. చాలా చిన్న మొత్తమని అసలు అంతా జగన్ కే పోయిదని వారు చెప్పినట్లుగా ఆర్కే ప్రకటించారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం జగన్ పేరు చెప్పలేదు. కానీ పరోక్షంగా బిగ్ బాస్ ఉన్నారని ఆయన హింట్ ఇచ్చారని అంటున్నారు. మరోసారి ఆయన విచారణకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా ఆర్కే అంచనా వేశారు.
అసలు ఆర్కే ఇంత స్టోరీ రాయడానికి కారణం భిన్నంగా ఉంది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో అడుగు ముందుకు పడకపోవచ్చని.. అందుకే లిక్కర్ స్కాములో మరింత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారని ఆయన డౌటనుమానం. ఎందుకంటే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరాలని అనుకుంటున్నారు. ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని చెబుతున్నారు. ఆయన బీజేపీలో చేరితో అక్రమాస్తుల కేసుల్లో నెంబర్ టుగా ఉన్నందున ఆయనపై కేసులు స్లో అయిపోతాయి. ఫలితంగా జగన్ పై కేసులు కూడా స్లో అవుతాయి. నిజంగా ఇదే జరిగితే.. విజయసాయిరెడ్డి ఖచ్చితంగా కోవర్టేనని బీజేపీ నేతలే కాదు అందరూ అనుకుంటారు. జగన్ కేసుల నుంచి బయటపడటానికి బీజేపీ ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఆర్కే ఈ లిక్కర్ స్కాం వ్యవహారంలో కీలక విషయాలు వెల్లడిస్తున్నారు కానీ.. అవన్నీ నిందితుల వాంగ్ములాలే. వారి వాంగ్మూలాలకు కోర్టులో పెద్దగా విలువ ఉండదు. కావాల్సింది జగన్ రెడ్డికి డబ్బులు చేరాయన్న సాక్ష్యాలు.ఇంకా వాటి విషయంలో దర్యాప్తు సంస్థలు ఎంత ముందడుగు వేశాయో మాత్రం..స్పష్టత లేదు.