ఇటీవల జరిగిన కేంద్రమంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళనలో మైనార్టీ వ్యవహారాల మంత్రి నజ్మా హెఫ్తులాని తప్పించబోతున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పుడు అటువంటిదేమీ జరుగలేదు కానీ మంగళవారం సాయంత్రం అది జరిగింది. ఆమె ఈరోజు సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. ఆమెతో బాటు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జి.ఎం.సిద్దేశ్వర కూడా తన పదవికి రాజీనామా చేశారు. వారిరువురి రాజీనామాలను రాష్ట్రపతి తక్షణమే ఆమోదించారు.
నజ్మా హెఫ్తులా నిర్వహిస్తున్న శాఖ బాధ్యతలని ప్రస్తుతం ఆ శాఖ సహాయమంత్రిగా చేస్తున్న ముక్తార్ అబ్బాస్ కి అప్పగించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా సహాయ మంత్రిగా చేస్తున్న సుప్రియకి భారీ పరిశ్రమల శాఖ బాధ్యతలని అధనంగా అప్పగించారు.