మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులకు హైబీపీ వచ్చింది. కోర్టు కస్టడీకి ఇచ్చింది. మూడు రోజుల పాటు ఆయనను ప్రశ్నించాల్సి ఉంది. జత్వానీ కేసులో సీఎం క్యాంపు ఆఫీసు పాత్రపై పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉంది. తమ దగ్గర ఉన్న ఆధారాలతో ఆయన నుంచి నిజాలు రాబట్టారని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆదివారం ఆయన హైబీపీకి గురయ్యారు.
నిబంధనల ప్రకారం కస్టడీకి తీసుకునే ముందు వైద్యపరీక్షలు చేయించాలి. ఆ పరీక్షల్లో హైబీపీ ఉన్నట్లుగా నిర్దారణ కావడంతో టాబ్లెట్లు ఇచ్చి ఆయనను మళ్లీ జైల్లో విడిచిపెట్టారు. ఈ రోజు కూడా ఆయనను కస్టడీకి తీసుకుని వైద్య పరీక్షలకు తరలించనున్నారు. మళ్లీ హైబీపీ వస్తే చికిత్స చేయించి జైలుకు తరలిస్తారు. ఈ విషయాన్ని కోర్టుకు చెప్పి కస్టడీని పొడిగించుకునే ఆవకాశం ఉంది.
పీఎస్ఆర్ ఆంజనేయలు వద్ద గత ప్రభుత్వ పెద్దల గుట్టు చాలా ఉంది. లిక్కర్ స్కాం నిందితుల్ని ఆయన కాపాడే ప్రయత్నం చేశారని పోలీసులకు స్పష్టమైన సమాచారం ఉంది. అదే సమయంలో విధుల్లో ఉన్నప్పుడు అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారు. వీటికి సంబంధించిన అంశాల్లోనూ సమాచారం రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పీఎస్ఆర్ కు టెన్షన్ తో బీపీ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది.