ఒక్క అడుగు… అనేది ఛత్రపతిలో పాపులర్ డైలాగ్. ఛత్రపతి ఆవేశానికి నిలువుటద్దంలా నిలిచిన ఓ సన్నివేశంలో ఈ ఒక్క అడుగు అన్న డైలాగ్ వినిపిస్తుంది. ఆ డైలాగ్ ప్రభాస్ అభిమానులందరికీ సుపరిచితమే! ఆ డైలాగ్‌ని టైటిల్‌గా మార్చి ప్రభాస్‌తో ఓ సినిమా చేయాలన్నది కృష్ణంరాజు ఆలోచన. ఆ సినిమాకి తానే దర్శకత్వం వహించాలని కలలుకన్నారు కూడా. నలుగురు రైటర్లను పురామాయించి ఒక్క అడుగు కథని తయారు చేయించారు. బాహుబలి ముందు ఈ సినిమానే పట్టాలెక్కాల్సింది. బాహుబలి వల్ల ఆలస్యమైంది. ఆ తరవాత ఒక్క అడుగు సంగతి మర్చిపోయారంతా! కానీ కృష్ణంరాజు మాత్రం ఒక్క అడుగు పనుల్లో బిజీగాఉన్నట్టు సమాచారం.
ఈ కథని ప్రభాస్ శైలికి తగ్గట్టుగా మలచడంలో ఆయన పూర్తిగా నిమగ్నమయ్యారని టాక్. అయితే… దర్శకత్వ బాధ్యత మాత్రం మరొకరికి అప్పగించాలని చూస్తున్నారట. ఇదే విషయమై కొంతమంది దర్శకులతో కృష్ణంరాజు చర్చిస్తున్నట్టు
సమాచారం. ప్రస్తుతం మారిపోయిన టెక్నాలజీని అందుకోవడం తనకు కష్టం కాబట్టి.. ఫామ్‌లో ఉన్న డైరెక్టర్‌కి ఒక్క అడుగు స్క్రిప్టు అప్పగిస్తే బాగుంటుందని రెబల్ స్టార్ ఆలోచన. ఈ చిత్రాన్ని తన సొంత సంస్థ గోపీకృష్ణ బ్యానర్లోనే తీయాలని భావిస్తున్నారు. మరి ప్రభాస్‌తో ఆ ఒక్క అడుగు వేయించే దర్శకుడెవరన్నది తేలాల్సివుంది.