ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో గ్రూప్ వన్ పరీక్ష అక్రమాలపై దృష్టి సారించింది. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీని హైకోర్టు రద్దు చేసింది. అయితే ఆ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లి అప్పటి వైసీపీ ప్రభుత్వం తాత్కలికంగా స్టే తెచ్చింది. కానీ ఆ ఉద్యోగాల భర్తీలో అక్రమాలపై విచారణలో చాలా విషయాలు వెలుగు చూశాయి.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 2018లో ఇచ్చిన గ్రూప్ 1 పరీక్ష ప్రక్రియ ప్రారంభమయింది. తర్వాత ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో అనేక అక్రమాలకు తెర తీశారు. పరీక్ష విధానంలో మార్పులు చేసేశారు. వాల్యూయేషన్ చేయాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది. ప్రభుత్వం వెంటనే.. ఆ ప్రక్రియను నిలుపుదల చేసింది. మాన్యువల్ పద్దతిలో దిద్దవద్దని డిజిటల్ విధానంలో దిద్దాలని నిర్ణయించింది. ఆ మేరకు దిద్ది ఫలితాలు విడుదల చేశారు. అయితే చాలా మంది ప్రతిభావంతులకు ర్యాంకులు రాలేదు. ఇలాంటి వారిలో సంజనా సింహ ఒకరు. తర్వాత ఆమె సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. 40లోపు ర్యాంక్ తెచ్చుకుని ఐఏఎస్ అయ్యారు. కానీ గ్రూప్ వన్ లో ఆమెకు ర్యాంక్ రాలేదు. తర్వాత మరోసారి మూల్యంకనం చేసి.. సంజనా సిన్హా ఇంటర్యూకు క్వాలిఫై అయ్యారని.. ఆమెకు మూడో ర్యాంక్ వచ్చిందని ప్రకటించారు.
అప్పుడే డిజిటల్ మూల్యంకనం చేసి అక్రమాలకు పాల్పడ్డారన్న విషయం స్పష్టమయింది. అయితే కోర్టుల్లో.. తుది తీర్పునకు లోబడి ఉండేలా నియామకాలు చేసేందుకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. తుది తీర్పులో అక్రమాలు బయటపడటంతో హైకోర్టు ఉద్యోగాలను రద్దు చేసింది. ఎన్నికలకు ముందు ఇది జరగడంతో గ్రూప్ వన్ అధికారులంతా ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చింది. చివరికి వైసీపీ ప్రభుత్వం మళ్లీ కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంది. కానీ తీర్పు అలాగే ఉంది. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా సీతారామాంజనేయులు. ఎపీపీఎస్సీ చైర్మన్ గా గౌతం సవాంగ్ ఉన్నారు. వారే అక్రమాల్లో కీలక పాత్ర పోషించారు. వైసీపీ నేతలు డబ్బులకు ఉద్యోగులకు అమ్ముకుంటే వీరు సహకరించారా లేకపోతే.. లేకపోతే వీరు కూడా వాటాలు తీసుకున్నారా అన్నది తేలాల్సి ఉంది.
పీఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పటికే జైల్లో ఉన్నారు. గౌతం సవాంగ్ ప్రభుత్వం మారిన మొదటి రోజే తన ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి కనిపించకుండా పోయారు. రాజ్యాంగబద్ధపదవి అయినప్పటికీ.. చేసిన అక్రమాలు బయటపడితే జైలుకు పోవాల్సి వస్తుందని ఆయన వెళ్లిపోయారు. అయినా ప్రభుత్వం వదిలే అవకాశాలు కనిపించడం లేదు.