అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఇటీవలే మొదలైంది. ఎనౌన్స్మెంట్ వీడియో ఒకటి బయటకు వదిలారు. ఆ వెంటనే ముంబైలో గప్ చుప్‌గా షూటింగ్ కూడా షురూ చేసినట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉంటారని తెలుస్తోంది. జాన్వీ కపూర్ పేరు ముందు నుంచీ గట్టిగా వినిపిస్తోంది. మృణాల్ ఠాకూర్నీ కథానాయికగా ఎంచుకొన్నారని సమాచారం. దాన్ని మృణాల్ కూడా చూచాయిగా ధృవీకరించింది. ఓదశలో దీపికా పదుకొణే పేరు కూడా వార్తల్లో నిలిచింది. అయితే అదంతా రూమరే అని తేలింది. ఇప్పుడు మూడో హీరోయిన్ గా అనన్య పాండే ఎంపికైనట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్.
విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేస్తున్న సినిమా ఇది. ఎనౌన్స్మెంట్ వీడియోతోనే ఆ సంగతి అర్థమైంది. పలు అంతర్జాతీయ గ్రాఫిక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం పని చేస్తున్నాయి. కథ ప్రకారం బన్నీ డ్యూయల్ రోల్ చేయనున్నాడని ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అదే నిజమైతే అల్లు ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ అందినట్టే. సన్‌పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. బన్నీ కెరీర్లోనే అత్యంత భారీ సినిమా ఇది. దాదాపు రూ.600 కోట్లకుపైగానే పెట్టుబడి పెడుతున్నట్టు చెన్నై వర్గాల సమాచారం. ఇందులో హీరో, దర్శకుడి పారితోషికమే రూ.250 కోట్ల వరకూ ఉంటుంది.