ఒ సినిమా విడుదల అవుతోందంటే కొద్దో గొప్పో హడావుడి ఉంటుంది. పెద్ద సినిమాలకు పబ్లిసిటీ పెద్దగా అవసరం ఉండదు. చిన్న సినిమాలకు వనరులు ఉండవు. కానీ మీడియం రేంజు సినిమాలు పబ్లిసిటీతో హోరెత్తిస్తుంటాయి. కానీ ఈ వారం విడుదలవుతున్న రెండు సినిమాలు మాత్రం పబ్లిసిటీ విషయంలో పిసినారిలా వ్యవహరిస్తున్నాయి. అవే… సెల్పీ రాజా, నాయకి.
నరేష్ నటించిన సెల్పీ రాజా ఈ వారం విడుదల కాబోతోంది. నరేష్‌కి గత కొన్నేళ్లుగా హిట్స్ లేవు. ఈ సినిమా కూడా అటూ ఇటూ అయిపోయిందంటే నరేష్ పూర్తిగా డల్ అయిపోతాడు. అలాంటప్పుడు ఇంకెంత జాగ్రత్త తీసుకోవాలి? కానీ పబ్లిసిటీ విషయం పట్టనట్టు వ్యవహరిస్తోంది సెల్ఫీ రాజా టీమ్. ఈ సినిమా కనీసం ఆడియో ఫంక్షన్ కూడా జరుపుకోలేదు. ట్రైలర్ కూడా రిలీజ్ కి 5 రోజుల ముందు విడుదల చేశారు. జులై 15 దాటితో మళ్లీ చిన్నా, పెద్ద సినిమాల హడావుడి మొదలైపోతుంది. అందుకే అర్జెంటుగా ఆడియో పంక్షన్ కూడా చేయకుండా సెల్పీ రాజా సినిమాని రెడీ చేసేశారు. కనీసం ఇప్పుడు కూడా పబ్లిసిటీ విషయంలో దృష్టి పెట్టలేదు. నాయకి పరిస్థితీ అంతే. త్రిష ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంపై కాస్తో కూస్తో బజ్ ఉంది. అయితే.. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఆ బజ్నికూడా పాడుచేసుకొంది టీమ్. ఇప్పటికే సినిమా విడుదల రెండుసార్లు వాయిదా పడింది. ఇప్పుడు 15న రావడానికి సిద్ధమైంది. అలాంటప్పుడు పబ్లిసిటీ దుమ్మెత్తిపోవాలి. ఈసారి రావడం ఖాయమే.. అని తెలిసేలా చేయాలి. కానీ.. చిత్రబృందం కామ్‌గా ఉంది. ఈ సినిమాకి సెంట్రాఫ్ ఎట్రాక్షన్ అయిన త్రిష ఇప్పటి వరకూ మీడియా ముందుకు రాలేదు. అలా ఉంది నాయకి పరిస్థితి. ఇది ఓవర్ కాన్ఫిడెన్సా?? లేదంటే… ఎంత చేసినా ఈ సినిమా ఆడదని ఫిక్సయిపోయారా? ఏంటో మరి ఈ ప్లానింగ్..??