సోమవారం ‘సింగిల్’ ట్రైలర్ బయటకు వచ్చింది. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ట్రైలర్ హిలేరియస్‌గా ఉంది. హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ ట్రైలర్లో వినిపించిన కొన్ని డైలాగ్స్ ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా ‘శివయ్యా’, ‘మంచు కురిసిపోవడం’ లాంటి పదాలు మంచు విష్ణుని హర్ట్ చేశాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘శివయ్యా’ అనే ఓ డైలాగ్ వుంది. దాన్ని చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు. ఇప్పటికీ అంది మంచి ట్రోలింగ్ స్టఫ్. అదే డైలాగ్, అదే రిథమ్ లో ‘సింగిల్’లో వాడాడు శ్రీవిష్ణు. ‘మంచు కురిసిపోవడం’ అనే మరో డైలాగ్ వుంది. ‘మంచు’ అనే పదం మరో అర్థంలో వినిపిస్తుంటుంది. ఇవి రెండూ విష్ణుని హర్ట్ చేశాయని, అందుకే ఛాంబర్లో ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈరోజో, రేపో.. ఆయన తన ఫిర్యాదుని ఛాంబర్ పెద్దలకు అందించే అవకాశం వుంది.
శ్రీవిష్ణు వివాదాలకు దూరంగా ఉంటాడు. మరెందుకు ఇలాంటి స్టఫ్ తన సినిమాలో పెట్టుకొన్నాడో? ముందుగా అనుమతి తీసుకొని, ఫ్రెండ్లీ రిలేషన్లో పాస్ చేసేసుకొంటే బాగుండేది. విష్ణు ఎలాంటి స్టెప్ తీసుకొన్నా శ్రీవిష్ణు సినిమాకు ఎగస్ట్రా పబ్లిసిటీ దొరుకుతుంది. అది మాత్రం ఖాయం.