భారత్ నుంచి విడిపోయి పాకిస్తాన్ గా ఏర్పడిన ప్రాంతం తర్వాత బంగ్లాదేశ్గానూ విడిపోయింది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఒకప్పుడు ఒకే దేశం. ఇప్పుడు రెండింటికీ పెద్ద తేడా లేకపోయినా.. బంగ్లాదేశ్ అంతో ఇంతో ప్రగతి దిశగా ముందడుగు వేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం.. ప్రపంచ టెర్రరిస్టుల దేశంగా మారింది. ప్రజల జీవన ప్రమాణాల గురించి అక్కడి పాలకులు పట్టించుకోరు. దేశ భద్రత గురించి అక్కడి ఆర్మీ పట్టించుకోలేదు. వారు చేయాల్సిన పనులు మాత్రం వారు చేయరు.. వేరే పనులు చేస్తూంటారు. ఫలితంగా ప్రపంచానికే పాకిస్తాన్ ఓ ఉండరాని దేశంగా కనిపిస్తోంది.
పాక్ రాజకీయం, వ్యవస్థలు అన్నీ డమ్మీలే !
పాకిస్తాన్ రాజకీయం అంతా మమ్మీగా ఉంటుంది. అంతర్గతంగా రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పడం కష్టం. ఎన్నికలు నిర్వహిస్తే వ్యవస్థలు ఎవరికి అనుకూలంగా పని చేస్తే వారే గెలుస్తారు. ఇమ్రాన్ గెలిచినప్పుడు ఆయన కోసం పని చేశాయి. తర్వాత ఆయనపై కోపంతో ఆయనను ఓడించారు. ఇప్పుడు జైల్లో పెట్టారు. కోర్టుల్లో వచ్చే తీర్పులు కూడా అలాగే ఉంటాయి. పాకిస్తాన్ లో రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడూ విదేశాల్లోనే ఉంటారు. గెలిస్తేనే వస్తారు. లేకపోతే లేదు. అక్కడే ఉండి రాజకీయాలు చేస్తారు.
ఆర్మీ చేయాల్సిన పని చేయదు !
పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడూ చేయాల్సిన పని చేయదు. సరిహద్దుల్లో భద్రత చూసుకోవడం ఆర్మీ పని. కానీ ఆ పని మాత్రం ఆర్మీ ఎప్పుడో మానేసింది. అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుంది. ప్రజాస్వామ్యం ఉందని చెప్పడానికన్నట్లుగా.. ఎన్నికలు నిర్వహిస్తుంది. ఇందులోనూ ఆర్మీదే కీలక పాత్ర. అసలు ఎన్నికల నిర్వహణలో ఆర్మీకి ఏం సంబంధం ?. అయినా జోక్యం ఉంటుంది. కాదు కూడదంటే.. దేశాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ఆర్మీ చీఫ్ లు రెడీగా ఉంటారు. ముషారఫ్ చేసింది అదే. అందుకే ఆర్మీతో గొడవ పెట్టుకోవాలని అధికారంలో ఉన్న పార్టీ అనుకోదు. మీ పని మీరు చేసుకోండని చెప్పే ధైర్యం ఉండదు. దీనికి తోడు ఆర్మీ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తుంది. పొరుగుదేశాల్లో ఉగ్రవాదానికి పాల్పడమని.. ఎగదోస్తుంది. కావాల్సిన సాయం అందిస్తుంది. కానీ సరిహద్దుల్లో వచ్చే సవాళ్ల విషయంలో మాత్రం ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మి, తాలిబన్ల చేతుల్లో ఎంత మంది చనిపోయారో పాక్ ఆర్మీకే తెలుసు.
ప్రపంచానికే ప్రమాదం పాకిస్తాన్
పాకిస్తాన్ ఉగ్రవాదుల అడ్డాగా మారింది. బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం వంటి వారు అక్కడ హాయిగా షెల్టర్ తీసుకునేవారంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిచాల్సిన పని లేదు. ఎంత చేసినా.. ఇలాంటి తప్పుడు పనులు మానుకోకపోవడం వల్ల.. పాకిస్తాన్ ఏ మాత్రం ముందుకు పోవడం లేదు. అభివృద్ధి లేదు. ప్రజల కనీస కనీస సౌకర్యాలు ఉండవు. పైగా ఉగ్రవాదానికి అడ్డాగా మార్చుకున్నారు. ఈ దేశం వల్ల ప్రపంచానికి ఎలాంటి ఉపయోగం లేకపోగా.. వినాశనానికి కారణం అవుతోంది. ఆ దేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ప్రపంచానికి ముప్పుగా మారింది.