పాకిస్తాన్కు మద్దతుగా ఉంటోందని కాంగ్రెస్ పై విమర్శలు పెరుగుతున్నాయి. కొంత మంది కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ అభిప్రాయం ప్రజలలో బలపడుతోంది. కొంత మంది కుహనా మేధావుల అడ్డగోలు వాదనలు.. ప్రజలకు అర్థం కాని లాజిక్కులను కాంగ్రెస్ పార్టీ తన విధానంగా ప్రకటించుకునే ప్రయత్నం చేయడంతో సామాన్యులకు మరింతగా దగ్గరవుతోంది. ఎప్పటికప్పుడు బీజేపీ ట్రాప్ లో పడుతోంది. ఈ సారి కూడా అదే జరిగింది. కాకపోతే ఇంకా ఎక్కువగా నిండా మునిగింది. దేశవ్యతిరేక పార్టీగా మారుతోంది. నిజంగా మారకపోయినా అలాంటి ముద్ర వేసుకుంటోంది.
పాకిస్తాన్, ఉగ్రవాదులపై కాంగ్రెస్ సానుభూతి వ్యాఖ్యలు
కశ్మీర్ లో ఉగ్రవాదులు మతం అడిగి చంపారు అన్నది బాధితులు చెప్పిన మాట. అక్కడ రాజకీయానికి తావు లేదు. అది నిజమే . ముస్లింలను అయితే చంపలేదు. కలిమా చదివిన వారిని చంపలేదు. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఉలిక్కి పడాల్సిన అవసరం ఏముంది?. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముస్లింలే. ఆ ఉగ్రవాదులపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదు. ఆ ఉగ్రవాదుల దేశం పాకిస్తాన్ పై జాలి చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఆ ఉగ్రవాదులే ముస్లింలు.. ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు. ఈ లాజిక్ ను కాంగ్రెస్ అర్థం చేసుకోలేక బీజేపీ ట్రాప్ లో పడిపోయింది.
ముస్లింలు అందరూ పాకిస్తాన్కు వ్యతిరేకం – కాంగ్రెస్ మాత్రమే తేడా
ముస్లింలను వెనకేసుకు వస్తున్నామన్న ఉద్దేశంతో ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడుతోంది. నిజానికి ఆ టెర్రర్ ను ముస్లింలు తీవ్రంగా ఖండించారు. కశ్మీరీ ముస్లింల నుంచి ఓవైసీ వరకూ అందరూ ఖండించారు. వారంతా ముస్లింలే. కానీ ఎవరూ పాకిస్తాన్ పై సానుభూతి చూపించలేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీనే .. యుద్ధం వద్దని.. అదని.. ఇదని ఉగ్రవాదులు, పాకిస్తాన్ పై సానుభూతి చూపించేలా మాట్లాడాల్సి వస్తోంది. .? ఈ మాటల్ని బట్టే కాంగ్రెస్ పార్టీకి ఓ రాజకీయ వ్యూహం లేదని గాలికి కొట్టుకుపోతుందని సులువుగా అర్థమైపోతుంది.
బీజేపీ రాజకీయాల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటుంది?
అవతలి వైపు రాజకీయం చేస్తోంది, కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీ స్థాయికి చేర్చింది బీజేపీ. ఎలా చేర్చిందో కాస్త ఆలోచిస్తే ఇలాంటి తప్పిదాలు చేయరు. దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చామని చెప్పుకునే పార్టీ ఇప్పుడు దేశ వ్యతిరేక పార్టీగా ఎందుకు ముద్ర వేసుకుంటోంది?. స్వాతంత్ర్యం పోరాటంలో అసలు పాత్రే లేదని వాదిస్తున్న బీజేపీ ఎందుకు దేశభక్తి పార్టీగా ముందుకు వచ్చింది?. ఈ రెండు ప్రశ్నల్లోనే కాంగ్రెస్ కు సమాధానం లభిస్తుంది. కానీ ముసలిదైపోయిన కాంగ్రెస్ చాదస్తంలోనే ఉంది