ఓ క్రిమినల్ ఆలోచనలు ఉన్న పాలకుడి కోరిక తీర్చడానికి చేసిన పనులు ఇప్పుడు ఐపీఎస్ వర్గాల్లో చిచ్చు పెట్టాయి. ఆ కేసులతో తనకేం సంబంధం లేదని చేయించిన ఇంటలిజెన్స్ చీఫ్ తప్పును తన ఆదేశాలను పాటించిన కాంతి రాణా టాటా, విశాల్ గున్నీల మీదకు తోసేస్తున్నారు. మొత్తం ప్లాన్ గీసి.. ఎగ్జిక్యూటివ్ చేసింది పీఎస్ఆర్ ఆయితే ఆయన ఆదేశాలను పాటించింది కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ. ఇప్పుడు పీఎస్ఆర్.. తనకేమీ తెలియదని అంతా వారే చేశారని అంటున్నారు.
విచారణలో పీఎస్ఆర్ చెప్పిన విషయాలపై వారిని ప్రశ్నించేందుకు సీఐడీ కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు నోటీసులు జారీ చేసింది. ఐదో తేదీన వారు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో వారు ముందస్తు బెయిల్ పొందారు. చాలా కాలం పాటు పోలీసులు అరెస్టు చేయకపోవడంతో కోర్టులో వారికి అనుకులంగా నిర్ణయం వచ్చింది. ఇప్పుడు వారు విచారణకు సహకరించకపోతే అరెస్టు చేసే అవకాశం ఉంది.
పీఎస్ఆర్ ఆంజనేయులు మరో ఏడాది తర్వాత రిటైర్ అవుతారు. కానీ టాటా, గున్నీలకు చాలా భవిష్యత్ ఉంది. కానీ చేసిన తప్పుడు పని వల్ల వారి కెరీర్ ఆగమ్య గోచరంగా మారుతోంది. చేయించిన వ్యక్తి తనకేమీ తెలియదని తప్పుకుంటున్నారు. మరి వీరు బలి పశువులు అవుతారా.. అసలేం జరిగిందో మొత్తం బయట పెడతారా అన్నదే కీలకం.