నాగారం మండలంలో పెద్ద ఎత్తున అధికారులు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేశారు. వాటిలో కొన్ని భూదాన్ భూములున్నాయని కోర్టుల్లో పిటిషన్లు వేశారు. అయితే అవన్నీ పట్టా భూములేనని వారంటున్నారు. ఈ వివాదం పక్కన పెడితే అంత పెద్ద ఎత్తున నాగారంలో వారు ఇళ్ల స్థలాలు ఎందుకు కొనుగోలు చేశారన్నది ఆసక్తికరం. ఆ ప్రాంతానికి ఉన్న భవిష్యత్ దృష్ట్యానే వారు కొనుగోలు చేశారని అనుకోవచ్చు.
మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామం రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతం. హైదరాబాద్ శివార్లలో ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కు సులువుగా చేరుకునేలా ఉంటుంది. మహేశ్వరం ప్రాంతాన్ని బిజినెస్ సెంటర్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది, ఇందుకోసం 14,000 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగించనున్నారు విప్రో, మలబార్ గోల్డ్, అమెజాన్, టాటా ఏరోస్పేస్, వెమ్ టెక్నాలజీస్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ ప్రాంతంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, అపార్ట్మెంట్ల నిర్మాణం పెరిగింది. దీర్ఘకాలిక పెట్టుబడులకు నాగారం అనువైన ప్రాంతం. నెట్-జీరో సిటీ ,ఇతర ప్రభుత్వ ప్రాజెక్టులు భవిష్యత్తులో ఆస్తుల విలువను గణనీయంగా పెంచుతాయి.
అక్కడ ధరలు కూడా అందుబాటులోనే ఉంటున్నాయి. ఏ వివాదం లేని వెంచర్లలో కాస్త ఎక్కువగా ఉన్నా.. భవిష్యత్ లో పెరుగుతాయని వేస్తున్న అంచనాల కంటే చాలా తక్కువే. అందుకే మంచి రిటర్న్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.