ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి పెద్ద షాక్ ఏది? రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇచ్చిన ర్యాంకింగ్స్ లో తనకు మంచి ర్యాంకు రాకపోవడం ఆయనను ఎక్కువ అసంతృప్తికి గురి చేస్తుందా? లేక తన ప్రధాన పత్యర్తి, దాయాది లాంటి కేసీఆర్ కు ఈ ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్థానం దక్కిందనేది ఎక్కువ అసంతృప్తిని మిగులుస్తుందా? ఈ రెండు ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు. ప్రధానమంత్రి ఇచ్చిన ర్యాంకింగ్స్ లో బాబుకు నంబర్ 13 దక్కిందని వార్తలు వస్తున్నాయి. ముందుగా బాబుకు ఐదో ర్యాంకు వచ్చిందని వార్తలు వచ్చినా, అదేం కాదు పదమూడో ర్యాంకు అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
బాబు కు అంత దారుణమైన ర్యాంకు రావడం ఒక ఎత్తు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నంబర్ వన్ దక్కిందని అంటున్నారు. అసలే.. ఏపీ, తెలంగాణలు చాలా విషయాల్లోపోటీలో ఉన్నాయి. కొంతకాలం కిందటే విడిపోవడం.. అక్కడా, ఇక్కడా తెలుగుదేశం పార్టీ ఉండటం, హైదరాబాద్ ను తనే అభివృద్ధి చేశానని బాబు పదే పదే చెప్పుకోవడం.. వంటి వాటి నేపథ్యంలో కేసీఆర్, బాబుల మధ్య తీవ్రమైన పోటీనే నడుస్తోంది. కేసీఆర్ కన్నా బాబు గ్రేటు అని చంద్రబాబు అభిమానులు, కాదు కేసీఆర్ గ్రేటని తెరాస అభిమానులు వాదించుకొంటూ ఉంటారు.
ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ కు నంబర్ వన్ ర్యాంకు.. చంద్రబాబుకు పదమూడో ర్యాంక్ అంటే.. అది తెలుగుదేశం పార్టీకి గుండెల్లో రాయే! ఒకవేళ బాబుకు మంచి ర్యాంక్ రాకపోయినా.. కేసీఆర్ కు అంతకన్నా దిగువస్థాయి ర్యాంకు వచ్చి ఉంటే.. తెలుగుదేశం అభిమానులు కొంచెమైన ఆనందంగా ఉండేవాళ్లు. కేసీఆర్ కన్నా బాబు బెస్ట్ అని చెప్పుకోవడానికీ అవకాశం లేదు. ఈ ర్యాంకింగ్స్ విషయంలో బాబు ఇప్పటికే అధికారుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఐదో ర్యాంకు ఏమిటి? అని ఆయన అసహనం వ్యక్తం చేశారట. మరి తనకు పదమూడు, కేసీఆర్ నంబర్ వన్ అంటే.. బాబు తీవ్రస్థాయిలో చిందులు తొక్కుతారేమో!