నాగచైతన్య ప్రేమమ్ రీమేక్ సాగుతూతూతూతూతూతూతూ ఉంది. ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలూ గోప్యంగానే ఉంచారు. ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్‌గానీ, టీజర్ గానీ బయటకు రాలేదు. సాహసం శ్వాసగా సాగిపో వచ్చి వెళ్లిపోయాక తప్ప ప్రేమమ్ ప్రమోషన్ల గురించి ఆలోచించకూడదని టీమ్ బాగా డిసైడ్ అయినట్టుంది. ఆగస్టు 12న జనతా గ్యారేజీకి పోటీగా ఈ సినిమాని విడుదల చేయాలని చిత్రబృందం ముందు భావించినప్పటికీ.. అంత రిస్క్ తీసుకోకపోవడమే మంచిదని ఇప్పుడు డిసైడ్ అయ్యందట. ప్రేమమ్ ఓ ఫీల్ గుడ్ మూవీ. మాస్ సినిమాలా చూసిన వెంటనే ఎక్కేయకపోవొచ్చు. మెల్లిమెల్లిగా ప్రేమమ్ పై ప్రేమ పెంచుకోవడానికి ఆడియన్స్‌కి టైమ్ ఇవ్వాలి. అందుకే పీక్ స్టేజీలో ఈ సినిమాని విడుదల చేయడం కంటే.. కాస్త ఖాళీ చూసుకొని తీసుకురావడమే బెటర్ అనుకొంటున్నార్ట.
ఓవరాల్‌గా ప్రేమమ్ రీమేక్ బాగానే వచ్చినప్పటికీ… కొన్ని చోట్ల స్లో నేరేషన్ బాగా ఇబ్బంది పెడుతోందని టాక్. ఈ విషయంలో అటు నాగచైతన్య ఇటు చందూ మొండేటి ఆలోచనలో పడ్డారట. కొన్ని సీన్లు లేపేయడమా, లేదంటే ఫీల్ క్యారీ అవ్వడం కోసం అలానే కొనసాగించడమా అనేది అర్థం కావడం లేదు. ఇటీవల వచ్చి ఒక మనసు, బ్రహ్మోత్సవం సినిమాలు స్లో నేరేషన్‌తో బాగా దెబ్బతిన్నాయి. ప్రేమమ్‌లోనూ అదే లోపం కనిపిస్తోంది. ఈ సినిమా రషెష్ చూసిన నాగార్జున కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు టాక్. సినిమా అన్ని విధాలా సంతృప్తి కరంగా వచ్చాకే విడుదల చేయాలని గట్టిగా చెప్పాడట నాగ్. అందుకే ప్రేమమ్ విషయంలో ఏమాత్రం తొందరపడడం లేదు చిత్రబృందం. సో.. ఈ లేట్ ఇలానే కొనసాగొచ్చు.