జబర్దస్త్ టీమ్‌లో ధన్‌రాజ్ ఒకడు. జబర్ దస్త్ అంటేనే ‘ఏ’ టైపు కామెడీనో ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. ‘ఆ’ డైలాగులతోనే ఆ బ్యాచ్ బ్యాచ్ అంతా సెటిలైపోయారు. వెండి తెరపై అడుగు పెట్టినా… ఆ ధోరణి మానుకోలేదు. ధన్‌రాజ్ హీరోగా నటించిన తాజా చిత్రం పనిలేని పులిరాజు. రేపే ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా జనం దృష్టిలో పడడానికి చిత్రబృందం రకరకాల పీట్లు చేస్తోంది. పోస్టర్లతోనే మైకం కమ్మించేలా ప్లాన్లు వేస్తున్నాయి.
హీరోయిన్ తన స్కర్ట్ పైకెత్తి.. హీరోకి బొడ్డు చూపిస్తున్న పోస్టరొకటి రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇంకోటి. హీరోయిన్ మంచంపై ఉంటే.. ధన్ రాజ్ చేతిలో కామసూత్ర కండమ్ ప్యాకెట్ చూపిస్తున్నాడు. పోస్టర్‌పైనే ఇలా ఉంటే… థియేటర్లో ఇంకెంత అరాచకం చేస్తారో మరి. అన్నట్టు ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. దాన్ని బట్టి సినిమా ఏ రేంజులో ఉంటుందో ఊహించుకోవొచ్చు. హీరోగా మారిన ఏ కమెడియన్… రాణించినట్టు చరిత్రలోనే లేదు. మరి ధన్‌రాజ్ సంగతి ఏటవుతుందో? ఇలాంటిచీప్ ట్రిక్స్ ప్లే చేస్తే సినిమాపై జనాలకు ఉన్న ఆసక్తి కాస్తా చచ్చిపోతుంది. ఈ సంగతి ధన్‌రాజ్‌కి ఎప్పుడు తెలుస్తుందో ఏంటో?