చేతి లో ఎప్పుడూ మూడు నాలుగు సినిమలుంచుకొనే హీరో నారా రోహిత్. హిట్లు లేకపోయినా… దర్శకులు నారా రోహిత్ వెంట పడుతుంటారు. ఇప్పుడు పరశురామ్ కూడా రోహిత్ కోసం ఓ స్టోరీ రెడీ చేసుకొన్నట్టు టాక్. వీరిద్దరి కాంబినేషన్లో ఇది వరకు సోలో వచ్చింది. ఆ సినిమా మరీ అంత హిట్టు కాకపోయినా ఓకే అనిపించింది. ఫ్యామిలీ ఎమోషన్స్ కి అద్దం పట్టిన సోలో… రోహిత్‌ని కుటుంబ ప్రేక్షకులకు దగ్గర చేసింది. అందుకే మళ్లీ అలాంటి కథతో వీరిద్దరూ కలసి ఓ సినిమా చేస్తున్నార్ట. ఈ సినిమాని ‘వన్స్ మోర్’ అనే పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. సోలోకి ఈ స్టోరీ దాదాపుగా కొనసాగింపులానే ఉంటుందట. ప్రస్తుతం పరశురామ్ శ్రీరస్తు – శుభమస్తు పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆగస్టులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నవంబర్‌లో నారా రోహిత్ సినిమా పట్టాలెక్కొచ్చు.