చిరంజీవి 150వ చిత్రాన్ని ఓ స్పెషల్ ప్యాకేజీగా మెగా ఫ్యాన్స్‌కి అందివ్వాలని భావిస్తోంది ఆ చిత్ర యూనిట్. చిరు ఫ్యాన్స్ ఎగ్జయిట్ అయ్యే ఏ విషయాన్నీ వినాయక్ అండో కో వదలడం లేదు. 150 వ సినిమా అన్నది ఓ అరుదైన మైలురాయి. దానికి తగ్గట్టే.. ఆ సినిమాని స్పెషల్‌గా తీర్చిదిద్దబోతున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా నటించే అవకాశాలున్నాయని టాలీవుడ్లో ఎప్పటి నుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి తోడు ఈ చిత్రానికి చరణ్ నిర్మాత కూడా. `డాడీతో కలసి నటించాలని ఉంది` అని చరణ్ చాలా సార్లుచెప్పాడు. మగధీర, బ్రూస్లీ సినిమాల్లో ఆ అవకాశం వచ్చింది కూడా. అయితే డాడీ 150వ సినిమా అనేది స్పెషల్ అకేషన్. అందుకే చరణ్ ఉత్సాహపడి ఉంటాడు. అయితేచరణ్ ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకొన్నాడని టాక్. ఎందుకంటే కత్తి లో చరణ్ చేయదగ్గ క్యారెక్టర్ ఏమీ లేదు. ఓ పాత్ర కావాలని డిజైన్ చేస్తే మాతృక లో ఉన్న ఫీల్ దెబ్బతీసినట్టు అవుతుంది. అందుకే ఆ ప్రయత్నం విరమించుకొన్నాడు. అయితే.. ఆ ప్లేసులో ఓ పాటలో చిందేయడానికి రెడీ అయ్యారని టాక్.
”డాడీతో కలసి నటించాలని వుంది. అయితే 150వ సినిమాలో ఆ ఆ స్కోప్ లేదు. పాటలో కనిపించమని వినాయక్ చెబితే ఓకే” అంటున్నాడు. అయితే తెర వెనుక మాత్రం చరణ్, చిరు కలసిచిందేయడానికి రెడీ అయిపోయారని టాక్. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కి ఆ విషయం ముందే చెప్పార్ట. ”నేనూ చరణ్ కలసి ఓ పాట చేయాలనుకొంటున్నాం. ఆ పాట అదిరిపోవాలి..” అంటూ దేవిశ్రీకి ముందే హింట్ ఇచ్చేశారని టాక్. సో.. చిరు, చరణ్ చిందేయడం ఖాయం.