మెంటల్ పోలీస్.. ఈమధ్య కాస్త వివాదాస్పదంగా మారిన టైటిల్ ఇది. శ్రీకాంత్ కథానాయకుడిగా కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మెంటల్ పోలీస్ టైటిల్ పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా చిత్రంపై స్టే విధించాలని కోరుతూ.. హైకోర్టుని ఆశ్రయించింది. కోర్టు కూడా పోలీసులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఈ సినిమా విడుదల ఆలస్యమైంది. చివరికి చిత్రబృందం రాజీకొచ్చి. టైటిల్‌ని మార్చడంతో శ్రీకాంత్ సినిమా విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఈ సినిమా టైటిల్ ఇప్పుడు పోలీస్ కాదు. కేవలం మెంటల్ మాత్రమే. ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేస్తున్నారు. అదే రోజు వెంకటేష్ చిత్రం బాబు బంగారం విడుదలకు సిద్ధమవుతోంది.
”ఈ చిత్రంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనపడతాను. రూల్స్ కు వ్యతిరేకంగా ఎవరూ నడుచుకున్నా, చివరకు కట్టుకున్న భార్య అయినా క్షమించని పాత్ర నాది. ఆగస్టు 12న సినిమా విడుదలవుతుంది. మెంటల్ పోలీస్ అనే టైటిల్ కారణంగా కోర్టు కేసు అయ్యింది. ఇప్పుడు సినిమా ‘మెంటల్’ అనే టైటిల్‌తో విడుదలవుతుంది. పోలీసులు గర్వంగా ఫీలయ్యే సినిమా ఇద”న్నారు శ్రీకాంత్.