కబాలి రేట్లు చూస్తే ఎవ్వరికైనా కళ్లు తిరగకమానదు. డబ్బింగ్ సినిమా అయ్యుండి.. స్ట్రయిట్ సినిమాలకు మించి ధర పలుకుతోంది. ఒక్క తెలుగు డబ్బింగ్ రైట్స్‌ని ఏకంగా రూ.32 కోట్లకుకొనుక్కొన్నారు. ఇప్పుడు నైజాం అభిషేక్ పిక్చర్స్ సంస్థ దక్కించుకొంది. దాదాపుగా రూ.10 కోట్లకు అమ్ముడుపోయిందీ సినిమా. నైజాంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని ప్రదర్శించబోతోంది. ఏరియాల వారిగా జరిగిన అమ్మకంతోనే షణ్ముణ పిక్చర్స్ దాదాపుగా గట్టెక్కేసిందన్నది టాక్. మల్టీప్లెక్స్‌లో ఆల్రెడీ బుకింగ్ మొదలైపోయింది. తొలి మూడు రోజులూ టికెట్లు దొరకడం కష్టమే. ఓవరాల్ గా చూస్తే దాదాపుగా రూ.220 కోట్ల బిజినెస్ జరిగిందట.
రూ.80 కోట్లతో పూర్తయిన సినిమా ఇది. బిజినెస్ పరంగా అంతకు మించిన లాభాల్ని తెచ్చుకొంది. సినిమా బాగుంటే ఫర్వాలేదు. ఏమైనా తేడా వస్తే.. బయ్యర్లకు నిర్మాతలు లెక్క చెప్పాల్సిందే. ఇది వరకు విక్రమ సింహా నష్టాలతో బయ్యర్లు అతలాకుతలం అయిపోయారు. ఇప్పుడు కబాలి కూడా దెబ్బకొడితే తట్టుకోలేరు. అందుకే కబాలి టీమ్ ఓవర్ కాన్ఫిడెన్స్‌కి పోవడం లేదు. తొలి రోజు ఆట పడేవరకూ వాళ్లకూ టెన్షన్లే. దానికి తోడు.. తెలుగు రాష్ట్రాలలో కబాలికి థియేటర్లు పెద్దగా దొరకడం లేదు. విక్రమ సింహ బయ్యర్లకు.. కబాలి నిర్మాతకూ జరుగుతున్న అంతర్గత పోరు వల్లే.. థియేటర్ల సమస్య తలెత్తింది. దాన్ని పరిష్కరించుకోవడానికి కబాలి టీమ్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. కోట్లు వచ్చినా కబాలికి టెన్షన్లు తప్పట్లు లేవు.