ఎస్ సి వర్గీకరపై సవరణ బిల్లుకి కేంద్రం సిద్ధం?
షెడ్యూల్డు కులాల రిజర్వేషన్ లో వర్గీకరణను అమలు చేయడానికి రాష్ట్రాలకు అధికారం ఇచ్చేలా ఆర్టికల్ 341 లో 3 వక్లాజ్ చేరుస్తూ రాజ్యాంగ సవరణ బిల్లు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం వుంది.
ఈ విషయమై కేంద్రం మీద వత్తిడి పెంచడానికి ఆగస్టు 12 వరకూ న్యూడిల్లోలోని జంతర్ మంతర్ లో డప్పులు మోగించే ఉద్యమాన్ని మంగళవారం మాదిగదండోరా మొదలుపెట్టింది.
ఇపుడు తెలుగురాష్ట్రాల్లో మాదిగలు ఒక ప్రెజర్ గ్రూప్ గా బలపడటానికి 20 ఏళ్ళుగా మాదిగదండోరా సాగిస్తున్న ఉద్యమాలు పోరాటాలే కారణం. కీలకదశకు చేరుకున్న స్ధితిలో మాదిగలలోని ఉన్నత విద్యావంతులు, వృత్తినిపుణులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో డిల్లీ చేరుకున్నారు.
ఎక్కువ సంఖ్యలో ఉన్న మాదిగలు విద్యా, ఉద్యోగాల్లో తక్కువ రిజర్వేషన్లు పొందటం, తక్కువ సంఖ్యలో ఉన్న మాలలు ఎక్కువ ఫలాలు పొందటమే వర్గీకరణ ఉద్యమానికి మూలం. వాటాను, కోటాను జనాభా నిష్పత్తి ప్రకారం పంచటమే వర్గీకరణ.
అయితే పరిస్ధితి ప్రతి రాష్ట్రంలోనూ ఒకేలా లేదు. ఉదాహరణకు సంఖ్యాపరంగా ఆంధ్రప్రదేశ్ లో మాలలు తెలంగాణాలో మాదిగలు ఎక్కువగా వున్నారు.
ఎస్ సి లలో వర్గీకరణ అవసరమని 2004 లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా వున్నపుడు శాసనసభ తీర్మానించి కేంద్రానికి పంపింది.
దీనిపై యూపీఏ ప్రభుత్వం 2007లో నియమించిన ఉషా మెహ్రా కమిషన్ ఎస్సీ వర్గీకరణ చేయాలని నివేదిస్తూ అందుకు రాజ్కాంగ సవరణే పరిష్కారమని సూచిం చింది.
రాజ్యాంగంలో ఆర్టికల్ 341 క్లాజ్ 3ని చేర్చి రాష్ట్రా లకు అధికారం ఇస్తే, వర్గీకరణ కావాల్సిన రాష్ట్రాలకు స్వేచ్ఛ కలుగుతుంది. వర్గీకరణ అంశాన్ని 2008లో బీజేపీ తన మేని ఫెస్టోలో పెట్టింది. బీజేపీకి అవకాశం ఉన్న రాష్ట్రాలలో వర్గీకరణ అమలు చేసింది. అవకాశం లేనిచోట హామీ ఇచ్చింది.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో వర్గీకరణతో సహా మూడు బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలని బీజేపీ చూస్తున్నందున సమావేశాలలో ఈ సమస్య పరిష్కారానికి అవకాశముంది. ఎస్ సి లవర్గీకరణలో అదేది రాష్ట్రాల స్వేచ్చగా రాజ్యాంగ సవరణ చేయడంలో కేంద్రానికి రాజకీయపరమైన సమస్యలు వుండకపోవచ్చుగనుక బిల్లు ముందుకి రావచ్చు!
పార్లమెంటులో రాజ్యాంగ సవరణకు బిల్లు పెడితే, అది తెలంగాణ బిల్లుకంటే సులువుగా నెగ్గుతుంది. రాజ్యాంగ సవరణ చేస్తే, రాష్ట్రాలకు కలిగే స్వేచ్ఛవల్ల వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రం (2004 తీర్మానం ప్రకారం) తెలంగాణ అవుతుంది.