మెగా హీరోలతో పనిచేస్తే ఓ సౌలభ్యం ఉంది. ఒకరితో ట్రావెల్ చేస్తే… ఆ ఫ్యామిలీలో అందరితోనూ టచ్‌లో ఉండొచ్చు. ఓ మెగా హీరోతో సినిమా తీసి హిట్టు కొడితే.. మరో మెగా హీరోకి కథ వినిపించేందుకు, సినిమా తీసేందుకు మార్గం సుగమం అవుతుంది. ఒకరితో ఫ్రెండ్ షిప్ ఉన్నా.. మరొకరితో టచ్ లోకి వెళ్లిపోవొచ్చు. ప్రస్తుతం సాయిధరమ్‌తో తిక్క సినిమా తీస్తున్న దర్శకుడు సునీల్ రెడ్డి. ఇది వరకు కల్యాణ్‌రామ్‌తో ఓం సినిమా తీశాడు. సునీల్రెడ్డికీ రామ్‌చరణ్‌కి మంచి దోస్తీ ఉంది. చరణ్ కోసం సునీల్ ఒకట్రెండు కథలు సిద్ధం చేశాడు కూడా. ఓం సినిమా హిట్టయితే… తదుపరి రామ్‌చరణ్‌తో సినిమా చేయాల్సినవాడే. కానీ ఓం ఫ్లాప్ అవ్వడంతో సునీల్ కూడా చరణ్‌కి కథ చెప్పే సాహసం చేయలేకపోయాడు.
అయితే సాయిధరమ్‌ని పట్టుకొని తిక్క అనే ఓ కథ చెప్పి ఒప్పించాడు. ఈ సినిమా ఇప్పుడు విడుదలకూ సిద్ధమైంది. నిజానికి ఇది రామ్‌చరణ్ కోసం రెడీ చేసుకొన్న కథట. ఈ కథ గురించి రామ్‌చరణ్‌కీ తెలుసు. తనే.. సాయిధరమ్‌కి చెప్పమని రికమెండ్ చేశాడట. తేజూకి ఈ కథ నచ్చడంతో వెంటనే ఓకే అనేశాడు. ఓం గనుక హిట్టయితే చరణ్ చేయాల్సిన సినిమా ఇదే! అది.. తేజూ దగ్గరకు వెళ్లింది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.