దర్శకుడు సంపత్ నందికి తమన్నా అంటే సెంటిమెంట్. రచ్చలో తమన్నాని కథానాయికగా ఎంచుకొన్నాడు సంపత్. ఆ సినిమా సంపత్ కెరీర్‌కి బాటలు వేసింది. బెంగాల్ టైగర్‌లోనూ తమన్నానే కథానాయికగా తీసుకొన్నాడు. ఆ సినిమా కూడా హిట్టే. ఇప్పుడు గోపీచంద్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో ముగ్గురు హీరోయిన్లున్నారు. తొలి కథానాయిక పాత్రకోసం తమన్నానే ఎంచుకొందామనుకొంటే కుదర్లేదు. డేట్లు ఎడ్జస్ట్ కాకపోవడంతో తమన్నా ప్లేసులో హన్సికని తీసుకోవాల్సివచ్చింది. తమన్నా ఈ సినిమాలో ఏదో ఓ రూపంలోఉండాల్సిందే అని సంపత్‌నంది పట్టుపడుతున్నాడట. అందుకే తమన్నా కోసం ఓ ఐటెమ్ సాంగ్‌నే దూర్చేశాడు స్ర్కిప్ట్‌లో.
అవును… గోపీచంద్ మూవీలో తమన్నా ప్రత్యేక గీతంలో నర్తించడానికి ఒప్పుకొందని సమాచారం. ఈ పాట కోసం రూ.35 లక్షల డీల్ కుదిరిందట. నిజానికి తమన్నా ఐటెమ్ సాంగ్ రేటు ఎక్కువే. అల్లుడు శీను లో ఓ పాట కోసం తమన్నా రూ.60 లక్షల వరకూ తీసుకొందని సమాచారం. అయితే సంపత్‌నందితో ఉన్న ఫ్రెండ్ షిప్ కొద్దీ.. తమన్నా రూ.35 లక్షలకు ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. చూశారా తమన్నా కోసం సంపత్.. సంపత్ కోసం తమన్నాలు ఎంత తాపత్రయపడుతున్నారో.. ఇలాంటి మ్యూచ్చువల్ అండర్ స్టాండింగ్ దర్శకుడు – హీరోయిన్ల మధ్య ఉంటే ప్రతీ సినిమాలోనూ ఓ ఐటెమ్ సాంగ్ చూసేయొచ్చు. సెప్టెంబరులో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది.