ముత్యాల నగరం హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మిస్టర్ వరల్డ్ పోటీల చరిత్రలో తొలిసారిగా ఓ భారతీయుడు ఈ టైటిల్ గెల్చుకున్నాడు. అతడి పేరు రోహిత్ ఖండేల్వాల్. హైదరాబాదీ.
యూకేలోని సౌత్ పోర్టులో జరిగిన ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 47 మంది పాల్గొన్నారు. ప్రత్యర్థులందరినీ వెనక్కి నెట్టి టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలో మొనగాడిగా టైటిల్ నే కాదు, భారీగా నగదు బహుమతిని కూడా అందుకున్నాడు. ఈ విజయం సాధించినందుకు అతడికి 50 వేల డాలర్ల క్యాష్ ప్రైజ్ దక్కింది. కుటుంబ, స్నేహితులు, అభిమానులు ఇచ్చిన మద్దతుతోనే తాను ఈ విజయం సాధించానన్నాడు రోహిత్. గ్రాండ్ ఫైనల్ ఈవెంట్ కు అతడు ప్రత్యేకంగా డిజైన్ చేయించిన డ్రెస్ లో వచ్చాడు. దాన్ని నివేదిక సాబూ డిజైన్ చేశారు.
హైదరాబాద్ లో పుట్టిపెరిగిన రోహిత్ వయసు 27 ఏళ్లు. ఆరోరా కాలేజీలో డిగ్రీ చదివాడు. కొంత కాలం స్పైస్ జెట్ కంపెనీలో పనిచేశాడు. ఆ తర్వాత డెల్ కంప్యూటర్స్ లో కొంత కాలం టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేశాడు. ఆ ఉద్యోగానికి టాటా చెప్పి మోడలింగ్ రంగంలో ప్రవేశించాడు. కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా నటించాడు. అలాగే, మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్ టైటిల్స్ గెల్చుకున్నాడు.
మిస్టర్ వరల్డ్ పోటీల్లో రోహిత్ ఏదో అదృష్టం కొద్దీ గెలవలేదు. అనేక విధాలుగా ప్రతిభను నిరూపించుకున్నాడు.