సినిమా హీరోలు తమ సినిమాలలో పాటలు పాడటం, రచయితలు దర్శకులుగా మారడం, దర్శకులు హీరోలుగా మారడం వంటివన్నీ ఈరోజుల్లో మామూలే. హీరోయిన్ సామంత కూడా నిర్మాతగా మారినట్లు తాజా సమాచారం. కానీ అది పూర్తి స్థాయి చిత్రానికి కాదు. సామాజిక స్పృహ, సామాజిక సేవ నేపధ్యంలో తమిళంలో తీస్తున్న ఒక షార్ట్ ఫిలింకి ఆమె నిర్మాతగా మారారు. ఈ షార్ట్ ఫిలిం ప్రయోగం అయినట్లయితే మున్ముందు మరిన్ని షార్ట్ ఫిలిమ్స్ తీయాలనుకొంటున్నట్లు టాక్.