అల్లరి నరేష్ ఈమధ్య ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ కు అమితాబ్ అన్న మాటలు ఏ విధంగా పనిచేసాయో తెలియ చేస్తూ ఒక ఆసక్తికర సంఘటనను బయట పెట్టాడు. తాను హీరోగా అవ్వాలని ఎంత ప్రయత్నించినా తన తండ్రి ఇ.వి.వి. సత్యనారాయణకు అప్పట్లో ఇష్టం లేని విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ అమితాబ్ మాటలు వల్ల తాను హీరోగా మారిన సందర్భాన్ని బయట పెట్టాడు.
తనకు హీరో లక్షణాలు లేవు అని తన తండ్రి భావించే ఆరోజులలో తాను తన తండ్రి నిర్మించే సినిమాలకు సంబంధించిన ఆర్ధిక వ్యవహారాలను చూసుకునే వాడిని అని చెపుతూ అప్పట్లో తన తండ్రి నిర్మించిన ‘చాల బాగుంది’ సినిమాకు అన్ని విషయాలు తాను దగ్గర ఉండి చూసుకున్న నేపధ్యం గుర్తుకు చేసుకున్నాడు ఈ అల్లరోడు. ఈసినిమా శతదినోత్సవ వేడుకలకు బాలీవుడ్ టాప్ హీరో అమితాబ్ బచన్ ను ముఖ్య అతిధిగా పిలవడమే కాకుండా అ ఫంక్షన్ కు సంబంధించిన అన్ని విషయాలను తాను చూసుకుంటున్న నేపధ్యంలో తన ఉత్సాహం చూసి అమితాబ్ తన తండ్రి వద్ద కామెంట్స్ చేసిన విషయాన్ని బయట పెట్టాడు.
6 అడుగుల 2 అంగుళాల పొడుగుతో మంచి లుక్ తో డైనమిక్ గా కనిపిస్తున్న నరేష్ ను ఎందుకు హీరోగా చేయలేదు అని ఇ.వివి. ని ప్రశ్నించాడట అమితాబ్. బిగ్ బి మాటలకు షాక్ అయిన ఇ.వి.వి. సత్యనారాయణ ఆ తరువాత తన ఆలోచన మార్చుకుని తాను హీరోగా మారడానికి తన తండ్రి లైన్ క్లియర్ చేసాడు అన్న విషయాలను ఇప్పుడు గుర్తుకు చేసుకున్నాడు అల్లరి నరేష్. ఈవిధంగా అల్లరి నరేష్ హీరోగా మారడానికి అమితాబ్ మాటలు ప్రాతిపదిక అయ్యాయి అనుకోవాలి..
తనుష్