జూనియర్ ఎన్టీఆర్ కలలు కంటున్న 100 కోట్ల కలక్షన్స్ కలను నిజం చేసే సినిమాగా భావిస్తున్న ‘జనతా గ్యారేజ్’ ‘కబాలి’ క్రేజ్ ను వాడుకోవడం అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టాలీవుడ్ టాప్ యంగ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్నంత మాస్ క్రేజ్ మరి ఏటాప్ యంగ్ హీరికి లేదు. అయితే అటువంటి టాప్ హీరో ఇప్పడు రజనీకాంత్ క్రేజ్ ను వాడుకుంటూ ఉండటం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.
ఆశక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళ్ళితే జూనియర్ ‘జనతా గ్యారేజ్’ ని మలయాళంలో కూడా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తోపాటు మరికొందరు మలయాళీ యాక్టర్స్ ఈసినిమాలో నటిస్తున్న నేపధ్యంలో మోహన్ లాల్ క్రేజ్ తో ‘జనతా గ్యారేజ్’ కి కేరళా రాష్ట్రంలో కూడ భారీ కలెక్షన్స్ వస్తాయని అశలు పెట్టుకున్నాడు జూనియర్.
ఇది ఇలాఉండగా ఈరోజు కేరళలో విడుదల అవుతున్న ‘కబాలి’ తో కలిపి ‘జనతా గ్యారేజ్’ టీజర్ ను కేరళ వ్యాప్తంగా ప్రదర్శించనున్నారు. అయితే ఈ ఎత్తుగడ వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. రజినీ ‘కబాలి’ మూవీ కేరళలో తమిళ్. మలయాళ వెర్షన్లు లో విడుదలఅవుతోంది. కబాలి మలయాళీ వెర్షన్ రైట్స్ మోహన్ లాల్ దగ్గర ఉండటంతో మోహన్ లాల్ జనతా గ్యారేజ్ ట్రైలర్ ని ‘కబాలి’ తో కలిపి థియేటర్స్ లో చూపెడుతూ పరోక్షంగా కేరళలో జూనియర్ క్రేజ్ పెంచడాని సహకరిస్తున్నాడు. జూనియర్ కు అల్లుఅర్జున్ కేరళా రాష్ట్రములో ఎర్పర్చున్న క్రేజ్ పై దృష్టి పెట్టిన నేపధ్యంలో జూనియర్ కు కేరళలో కూడ ఇమేజ్ పెరగడానికి ‘కబాలి’ ఈవిదంగా సహకరిస్తున్నాడు అనుకోవాలి…
తనుష్.