విజయ్ – అమపాలాల్… రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకొన్న సినీ జంట. తమిళ నాట దర్శకుడిగా విజయ్ తనకంటూ ఓ ముద్ర వేశాడు. అమలాపాల్ కూడా బిజీగానే ఉండేది. ఆ సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకొన్నారు. ఇప్పుడీ బంధం బీటలు వారుతోందని తమిళ సినీ వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి. విజయ్, అమలాపాల్ మద్య మనస్పర్థలు పుట్టుకొచ్చాయని, వీళ్లిద్దరూ ప్రస్తుతం దూరంగా ఉంటున్నారని టాక్. పెళ్లయ్యాక అమలాపాల్ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆ తరవాత పసంగ 2లో నటించింది. ఇప్పుడామెకు మెల్లిమెల్లిగా ఆఫర్లు వస్తున్నాయి. ఈ విషయంలోనే అమలాపాల్‌కు, విజయ్‌కూ మధ్య గొడవలు వస్తున్నాయట. సినిమాల్లో నటించొద్దని విజయ్… నటిస్తానని అమలాపాల్ పట్టుబట్టి కూర్చున్నారని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఇద్దరి మధ్యా గ్యాప్ వచ్చిందని సమాచారం. సినిమా వాళ్ల ప్రేమలూ, పెళ్లిళ్లూ ఇలానే ఉంటాయి. చాలా త్వరగా ప్రేమలో పడతారు.. అంతే త్వరగా తూచ్ చెప్పుకొంటారు. మరి ఈ జంట సంగతి ఏమవుతుందో, ఈ సమస్య నుంచి వీళ్లిద్దరూ ఎలా బయటపడతారో చూడాలి.