రానా చేసిన సినిమాలు తక్కువే అయినా.. గాసిప్పుల్లో మాత్రం ఎక్కువగా కనిపించేవాడు.. వినిపించేవాడు. బిపాసాబసుతో చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నాడని అప్పట్లో చెప్పుకొన్నారు. ఆ తరవాత… త్రిష పేరు రానాతో లింకప్ అయి వినిపించింది. ఈమధ్య ఓ కథానాయికతో బాగా చనువుగా ఉంటున్నాడని టాక్. అయితే ఈ నేపథ్యంలో రానా పెళ్లిపై సురేష్ బాబు చేసిన వ్యాఖ్యలు కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి. రానాకి పెళ్లెప్పుడు చేస్తారు??? అని అడిగితే ”యేడాదిలో చేస్తాం.. కానీ సంబంధం మేం చూడాలో, వాడే చూసుకొన్నాడో తెలియడం లేదు.. ఎవరిని చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనే నిర్ణయం వాడి చేతుల్లోనే ఉంది” అన్నారాయన.
అంటే.. రానా లవ్‌లో ఉన్నట్టే కదా? ఆల్రెడీ ఆ కుటుంబానికి నాగచైతన్య ఓ షాక్ ఇచ్చాడు. చైతూ సమంతతో లవ్‌లో ఉన్నాడని, వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్నది అందరికీ తెలిసిన రహస్యమే. ఇప్పుడు రానా కూడా చైతూని ఫాలో అయిపోతున్నట్టే కనిపిస్తోంది. రానా దృష్టి ప్రస్తుతం బాహుబలి 2, ఘాజీ చిత్రాలపై ఉన్నాయి. బాహుబలి 2017 ఏప్రిల్‌లో విడుదల అవుతుంది. ఆ తరవాతే.. రానా పెళ్లయ్యే ఛాన్సుంది. మరి పెళ్లికూతురు ఎవరో, పెళ్లి కూతుర్ని ఎంచుకొనే ఛాయిస్ ఫ్యామిలీకి ఇస్తాడో లేదో… రానాకే తెలియాలి.