ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో నెలకొల్పతలపెట్టిన అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడకు తరలి వస్తోంది. మరో అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్ధాపించడానికి ప్రకాశం జిల్లాలో స్ధలం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం తాజాగా ఉత్తరం రాసింది.
ఈ సందర్భంగా కేంద్ర ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఇఎఎస్ శర్మ ఏడు ప్రశ్నలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖరాశారు. శర్మ లేవనెత్తిన అంశాల గురించి ప్రజలు కూడా ఆలోచించుకోవలసి వుంది.
-
అణువిద్యుత్ ప్లాంటుల స్ధాపనకు ప్రపంచబ్యాంకు ఎందుకు రుణం ఇవ్వడం లేదు?
- ప్రపంచంలో ఏ ఇన్సూరెన్సా కంపెనీ అయినా అణువిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఎందుకు భీమా చేయడం లేదు?
- భోపాల్ లో మాదిరిగా ఇక్కడ కూడా ప్రమాదం జరిగితే నష్టం ఎవరు భరిస్తారు.
- అమెరికాలో 1979లో నుండి ఒక్కరియాక్టర్ కూడా ఎందుకు పెట్టలేదు..భారతదేశం బకరాగా కనిపిస్తుందా? అమెరికా క్యాలిపోర్నియాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వద్దని చట్టంచేశారు. మొన్న ఒకటి మూశారు..ఉన్న ఇంకోకటి 2024 లో మూసివెస్తున్నారు? అక్కడ మూసివేస్తున్న అణు శక్తి కేంద్రాలు ఇక్కడ అవసరామా?
- ప్రాజెక్టు చూట్టు 1.06 కిలో మీటర్లు లోపు ఎందుకు ప్రజలు ఉండకూడదని జీవోలో ఉంది. అంత సేఫ్ అయితే ఎందుకు ఉండకూడదు..5కిలో మీటర్లువరకు అభివృద్ది కార్యక్రమలు చేయడానికి వీలు లేదు. కొవ్వాడలో 16 గ్రామాలు ఉన్నాయి ఈగ్రామాలలో అభివృద్ది చేయకూడదని అనుకున్నారు. కారణం ఏంటీ? 16 కిలో మీటర్ల లో 2లక్షల మంది ఉన్న ప్రజలను ప్రమాధం జరిగితే లారీలలో తరలిస్తారు. కానీ భూపాల్ ఘటలనలో ఇప్పటివరకు కోర్టు ఎన్ని సార్లు చెప్పిన తరలించలేదు..మరీ ఆంధ్రలో పరిస్ధితి ఏంటీ? 30 కిలో మీటర్లు రౌడియోషన్ ఉంది.వస్తుందని లెక్కలు చేబుతున్నాయి.
- వెస్టింగ్ హౌస్ కంపెనీ ఎపి 1000 పేరుతో కొవ్వాడలో అణువిద్యుత్ ప్లాంట్ పెడుతుంది. ప్రపంచంలో ఈ కంపెనీ ఎక్కడైన ఇలాంటి ప్లాంటు పెట్టిందా?
- ఇటువంటి ప్లాంట్ లలో ప్రమాధాలు జరిగితే బయటకు తెలిసే పరిస్ధితి ఎక్కడ లేదు. కుడంకుళంగానీ, ఇతర కంపెనీలలో కానీ ఇదే పరిస్ధితి కనిపిస్తుంది. గుజరాత్ లో కకర్ తాల్ అనే ప్రాంతంలో ఇటువంటి ప్రమాధం జరిగితే కంపెనీ కానీ అధికారులు కానీ బయటకు రానివ్వలేదు..మరీ ఇక్కడ ప్రమాదాలు జరిగితే ఏం చేస్తారు?