జాతీయ ఉత్తమ నటుడు మోహన్‌లాల్ కి అద్భుతమైన అలవాటు ఉంది. తాను ఏ భాషలో నటించినా… తనకు సంబంధించిన డైలాగుల్ని తనే చెబుతాడు. డబ్బింగ్ బాధ్యత మరొకరికి అప్పగించడానికి ఏమాత్రం ఇష్టపడడు. మనమంతా సినిమాకీ అదే అలవాటు కొనసాగించాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కాబోతోంది. తాజాగా ట్రైలర్ బయటకు వచ్చింది. ట్రైలర్ డీసెంట్‌గానే ఉన్నా.. మోహన్ లాల్ డైలాగులు మాత్రం కలవరపెడుతున్నాయి. నాలుగైదు డైలాగులు పలికిన మోహన్‌లాల్.. అందులో ఒక్కడైలాగూ అర్థం కావడం లేదు. ముద్ద ముద్దగా మాట్లాడుతుంటే… చెవులు రిక్కరించి మరీ వినాల్సివస్తోంది. ట్రైలర్లోనే ఇంత ఇబ్బంది పెడితే సినిమా మాంటేంటి? అనేది అందరి డౌట్.
ఇదే విషయంపై దర్శకుడు మాట్లాడుతూ ”తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవాలన్నది మోహన్ లాల్ బలమైన కోరిక. దాన్ని మేం కాదనలేకపోయాం. ప్రచార చిత్రాల్లో ఆయన మాట స్పష్టంగా లేదన్న మాట వాస్తవమే. అయితే… ఆ ఇబ్బంది గమనించి డబ్బింగ్ చెప్పేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొన్నాం. సినిమా చూస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందీ రాదు. బేసిగ్గా ఆయనకు తెలుగు అంతగా రాదు. అలాంటప్పుడు మలయాళ స్లాంగ్ మిక్స్ చేసి చెప్పడం వల్ల ఈ ఇబ్బంది ఎదురవుతోంది” అన్నారు. జనతా గ్యారేజ్కీ మోహన్ లాల్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు. మనమంతా విడుదలై.. దానికొచ్చిన టాక్ బట్టే ఈ విషయంలో జనతా గ్యారేజ్‌పై ఓ నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయి.