‘క్షణం’ సినిమాతో తన ఖాతాలో ఓ హిట్ వేసుకొన్నాడు ఆది. ఆ సినిమాతో ఆదాశర్మ కూడా హిట్ హీరోయిన్ అనిపించుకొంది. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి కలసి నటిస్తున్నారు. క్షణంతోనే ప్రేక్షకుల దృష్టిలో పడిన రవికాంత్ పేరేపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఆగస్టు ఆఖరి వారంలో షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి ‘గూఢచారి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అభిషిక్ పిచ్చర్స్సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇదికూడా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే సినిమానే. క్షణం సినిమా చేస్తున్నప్పుడే ‘నీతో మరో సినిమా చేస్తా’ అని రవికాంత్ పేరేపు.. అడవిశేష్కి మాటిచ్చాడట. ఆ సినిమా హిట్ అవ్వడంతో.. గూఢచారి సెట్స్‌పైకి వెళ్తుంది. నిజానికి ఈ సినిమా కూడా పీవీపీ బ్యానర్ నుంచే రావాలి. అయితే.. రవికాంత్‌కి భారీ రెమ్యునరేషన్ ఇవ్వడంతో.. అభిషేక్ పిక్చర్స్ వైపుకు టర్న్ అయ్యాడు రవికాంత్. అన్నట్టు క్షణం హిట్‌తో అడవి శేష్ లో కాన్సిడెన్స్ లెవల్స్ పెరిగినట్టున్నాయి. సైడ్ క్యారెక్టర్స్, కీ రోల్స్ చేయనని మొహం మీదే చెప్పేస్తున్నాడట. హీరో పాత్రలకే ఓకే అంటున్నాడట. ఈ గూఢచారి కూడా హిట్టయితే ఇంకెన్ని వినాల్సివస్తుందో??